మాగనూరు : మాగనూరు (Maganur) మండల పరిధిలోని పుంజనూరు ప్రాథమిక పాఠశాల విద్యార్థి గురుకులకు (Gurukul school ) ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్ గౌడ్ తెలిపారు. 4వ తరగతి చదువుతున్న స్వేచ్ఛ గురుకులం లో ఐదో తరగతి ప్రవేశానికి ఫిబ్రవరి 23 న గురుకుల పాఠశాల పరీక్షలలో పాల్గొని మంచి మార్కులు సాధించింది.
ఈనెల 6 న విడుదలైన ఫలితాల్లో గురుకుల పాఠశాలకు విద్యార్థిని స్వేచ్ఛ( Swetcha ) ఎంపికయ్యిందిని వివరించారు. ఈ సందర్భంగా ఆమెను హెచ్ఎంతో పాటు , అంగన్వాడీ టీచర్ మాధు, గ్రామస్థులు శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందించారు. భవిష్యత్‌లోనూ మంచి ఫలితాలు సాధించి చదువుకున్న పాఠశాలకు , తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు సాధించిపెట్టాలని ఉపాధ్యాయులు కోరారు. స్వేచ్ఛ గురుకుల పాఠశాలకు ఎంపిక కావడానికి ఎంతో కృషిచేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులను పలువురు అభినందించారు.