మహబూబ్‌నగర్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వనపర్తి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి.. వేరే వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించి.. వర్క్ ఆర్డర్ కాపీ ఇ చ్చి మరీ రూ.3.55 కోట్లు చీటింగ్ చేశాడు. ఈ మేరకు బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఘటన తీవ్ర సంచల నం రేకెత్తిస్తున్నది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలకేంద్రానికి చెందిన ఒ గ్గు పర్వతాలు సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. సబ్ కాంట్రాక్ట్‌లు తీసుకొని కూలీలతో పని చేయించే క్రమంలో పర్వతాలుకు పెద్దమందడి ఎంపీపీ తూడి మేఘారెడ్డి పరిచయమయ్యాడు. ఎస్ఈడబ్ల్యూ (SEW) సదరన్ కంపెనీ లో చాలా పనులు చేశానని, పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు చేస్తుంటానని, వనపర్తి జిల్లాలో కూడా రూ.600 కోట్ల ఇరిగేషన్ వర్క్‌లు చేశానని నమ్మించాడు. ఛత్తీస్‌ఘడ్‌లో రైల్వే కాంట్రాక్ట్ వచ్చిందని, అక్కడ సబ్ కాంట్రాక్ట్ ఇస్తానని హైదరాబాద్ కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో ఉన్న తన ఇ ంటికి పర్వతాలును పిలిపించుకున్నాడు. ఛత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడలో సహకరిస్తే భవిష్యత్‌లో మంచి మంచి కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానని, అవసరమైతే ఎస్క్రో అకౌంట్ ఇప్పిస్తానని నమ్మించాడు.
ఈ క్రమంలో 2017 జనవరిలో పర్వతాలు చత్తీస్‌ఘడ్‌లో పనులు ప్రారంభించాడు. అదే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన వనపర్తిలోని గ్రీన్‌పార్కు హోటల్లో వ ర్క్ ఆర్డర్ కాపీ ఇవ్వడంతో నెలలో 20 రోజులు అక్కడే ఉండి పనిచేయించాడు. బిల్లులు అడిగితే ఇంకా సదరన్ కంపెనీ వాళ్లు ఇవ్వలేదు. కచ్చితంగా ఇస్తారు అని చెప్పడంతో అప్పు తీసుకొచ్చి పని చేయించాడు. అనుమానం వచ్చి కంపెనీ వద్దకు వెళ్లి వాకబు చేయగా.. డబ్బులు ఎప్పుడో ఇచ్చాం అని చెప్పారు. ఈ విషయంపై మేఘారెడ్డిని అడగగా.. వందల కోట్ల ఇరిగేషన్ వర్క్‌లు చేశాను.. నీ డబ్బులు వడ్డీతో సహా ఇస్తాను.. మళ్లీ మళ్లీ అడగకు అని బెదిరింపులకు పాల్పడ్డాడు. రూ.10 లక్షలు అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయగా.. ఇంకా రూ.3.55 కోట్ల బిల్లులు మాత్రం ఇవ్వలేదు. ఇటీవల జరిగిన హనుమాన్ జయంతి రోజున బిల్లులు ఇవ్వాలని వనపర్తిలో అడిగేతే తనను బెదిరించాడని, మేఘారెడ్డి వల్ల కుటుంబానికి ప్రాణహాని ఉందని వనపర్తి టౌన్ పీఎస్‌లో ఈ నెల 12న ఫిర్యాదు చేయడంతో 420, 406, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ (నంబర్ 58/2023) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి తెలిపారు. అయితే, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉందని, ఆధారాలు సేకరించిన తరువాత చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.