మరికల్, జూన్ 23 : ఆకలితో హోటల్‌కు వెళ్లిన కస్టమర్‌కు వింత అనుభవం ఎదురైంది. మరికల్ మండల కేంద్రానికి కనక మహాలక్ష్మీ కిచెన్ హోటల్‌కు మంగళవారం వినియోగదారుడు లక్ష్మీకాంత్‌రెడ్డి వెళ్లి స్నాక్స్ ఆర్డర్ చేశాడు. పకోడతో పాటు ప్లేట్లో స్టీల్ ముక్క దర్శనమివ్వడంతో అవాక్కయ్యాడు. ఈ విషయమై హోటల్ యజమానిని నిలదీస్తే ‘నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో’.. ‘ఏ పత్రికలోనైనా రాయించుకో’.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ దబాయించాడని కస్టమర్ ఆవేదన చెందాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లపై తనిఖీలు నిర్వహించి నాణ్యమైన ఫుడ్ అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.