ఊటూర్ (కృష్ణ), అక్టోబర్ 24 : కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి మనోవేదనకు గురవుతున్నాడు. భర్త, అత్త, ఆడపడుచుల వరకట్న వేధింపులు భరించలేక తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని, వారికి శిక్ష పడాలంటూ.. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తున్నాడు. బాధితుడి కథనం మేరకు.. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూరు గ్రామానికి చెందిన చెన్నప్పగౌడ కర్ణాటకలోని శక్తినగర్ శిల్ప కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. దేవసుగూర్లో ఉంటున్నాడు. ఒక్కగానొక్క కూతురు జ యలక్ష్మిని ఐదేండ్ల కిందట కర్ణాటక రాష్ట్రం సేడం తాలూ కా శంకర్పల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శంకర్‌రెడ్డితో వివాహం జరిపించారు. వారికి ఒక కూ తురు ఉన్నది. కొన్నేండ్లపాటు కాపురం సజావుగా సాగగా.. అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తారింటి వేధింపులు మొదలయ్యాయి. ‘మీ నాన్నకు నీవు తప్పా ఇంకెవరున్నా రు.. ఆస్తి మొత్తం నీకే వస్తుంది కదా..’ అంటూ చెప్పసాగారు. కూతురు కాపురాన్ని నిలబెట్టేందుకు చెన్నప్పగౌడ పలుమార్లు రూ.లక్షల్లో అత్తారింటికి ముట్టజెప్పాడు.
అ యినా భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు ఆగకపోవడంతో ఏడాది కిందట ఉగాది రోజున మనోవేదనకు గురైన జయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నది. కూతురు మరణానంతరం ఇరుకుటుంబాల బంధువులు, గ్రామస్తుల సమక్షంలో కట్నం కింద ఇచ్చిన రూ.10లక్షలు, 30తులాల బంగారం, పదెకరాల పొలాన్ని ఇచ్చేందుకు రాజీ కుదుర్చుకున్నారు. ప్రస్తుతం మనమరాలు తండ్రి వద్దే ఉంటున్నది. ఇదిలా ఉండగా, తనకు ఇస్తామన్న డబ్బు, బం గారం, పొలం గురించి అడిగితే రాజకీయ పలుకుబడితో తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, గుల్బర్గా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు విలపిస్తున్నాడు. మక్తల్ పో లీసుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని చెబుతున్నాడు. ఆస్తికోసం మనమరాలిని కూడా చంపుతారనే భ యం వెంటాడుతున్నదని, పొలీసులు పట్టించుకోకపోవడంతో తన కూతురు మృతికి కారణమైన భర్త, అత్త, ఇ ద్దరు ఆడపడుచులకు కఠిన శిక్ష పడాలని కోరుతూ ఫ్లెక్సీల ను ఏర్పాటు చేస్తున్నానన్నారు. ఇప్పటికే కర్ణాటకలోని గు ల్బర్గా, దేవసుగూర్, సేడం, యాద్గిర్ పట్టణాల్లో ఫ్లెక్సీలను కట్టానని, తెలంగాణలో కృష్ణ మండలం గుడెబల్లూరుతోపాటు మరికొన్ని చోట్ల కూడా కడుతున్నట్లు చెప్పాడు. ఫ్లెక్సీల విషయంపై కృష్ణ పోలీసులను ప్రశ్నించగా.. తమ దృష్టికి రాలేదని చెప్పారు.