వెల్దండ డిసెంబర్ 22 : అంతర్ జిల్లాలో వివిధ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసి 6మంది నిం దితులను రిమాండ్‌కు తరలించినట్లు కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు పేర్కొన్నారు. గురువారం వెల్దండ సర్కిల్ కార్యాలయంలో కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చారకొండ మండలంలోని బోర బండతండాలో చోరీలకు పాల్పడి బొలెరో వాహనంలో వె ళ్తున్న నిందితులను చారకొండ ఎస్సై కల్యాణ్‌రావు అదుపులోకి తీసుకున్నారు. చారకొండ మండలకేంద్రానికి చెందిన రంజిత్‌కుమార్ ట్రాక్టర్ అక్టోబర్ 17న చోరీకి గురైనట్లు తెలిపారు.
అదే విధంగా రామచంద్రాపూర్‌లో ఇంటికి అమర్చి న గేట్, సీతారంతం డాలో వ్యవసాయ బోరు మోటర్లు, వంగూర్ మండలం సర్వారారెడ్డిపల్లిలో ఏసీ, సిలిండర్లు, మోటర్లు చోరీపై 4 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన దండుగుల నర్సింహ, కోదాడకు చెందిన సంపగి యాదగిరి, సంప గి నవీన్, నల్లగొండకు చెందిన సంపంగి రాజశేఖర్, చెర్వుగట్టుకు చెందిన ఒర్సు కొండల్, ము నుగోడుకు చెందిన శ్రీరాములు, చిలుకూరు మండలానికి చెందిన ఒర్సు రవి 7మంది ము ఠాగా ఏర్పడి ట్రాక్టర్ల ట్రాలీల చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో మరో ఇద్దరు శ్రీ రాములు, రవి మరో కేసులో అరెస్టు అయ్యి సూర్యాపేట జిల్లా చివ్వేముల పోలీస్ స్టేషన్లో ఉండగా మ రో వ్యక్తి ఒర్సు కొండల్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు.
మరో ముగ్గురు అరెస్ట్..
ట్రాక్టర్ ట్రాలీల దొంగతనాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న దండుగుల నర్సింహతో పాటు పిట్ల శ్రీను, పిట్ల రాజు మరో ముఠాగా మారి ఇంటి సామగ్రితోపాటు వ్యవసాయ బోరు మోటర్లు వైర్లు చోరీలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ గిరిబాబు వివరిం చారు. చారకొండ ఎస్సై రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వారిపై అనుమానం వచ్చి బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో వ్యవసాయ బోరు మోటర్లు, ఇంటి నిర్మాణ గేట్లు, ఫిన్షింగ్ వైర్లు, ఇనుప పైపులు ఉండడంతో విచారణ జరపగా అసలు విషయం బయట పడిందన్నారు. ట్రాక్టర్ల ట్రీలీల చోరీలో ప్రధాన నిందితుడిగా ఉన్న నర్సింహతోపాటు పిట్ల శ్రీను, పిట్ల రాజును అర్టెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వీరిపై గతంలో కోదాడ, సూర్యాపేట, సిద్ధిపేట, చివ్వేముల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు.
సీఐ, ఎస్సైలకు రివార్డులు
అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న వెల్దండ సీఐ శివరాత్రి రామకృష్ణ, చారకొండ ఎస్సై కల్యాణ్‌రావును డీఎస్పీ గిరిబాబు అభినందించారు. ఇరువురికి రివార్డులు అందజేయన్నుట్లు ఆయన ప్రకటించారు.