నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 13 : జోరుగా.. హుషారుగానాగర్కర్నూల్ మండలం, మున్సిపల్‌కు సంబంధించిన బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో గురువారం తా డూరు మండలం ఇంద్రకల్ గ్రామంలోని మహాలక్ష్మి కాటన్ మిల్లులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మ ల్లారెడ్డి మాట్లాడుతూ గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. వారి హయంలో మంత్రులుగా ఉన్నవారు కనీసం తాగునీరు కూడా అందించలేకపోయారని మండిపడ్డారు. గ్రామాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులు.. వారి ప్రభుత్వాల హయాంలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.
అభివృద్ధి చేయాల న్న, పేదలను పట్టించుకోవాలన్న సోయి లేకుండా పోయిందన్నారు. స్వరాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగునీటిని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ కండ్లల్లో ఒత్తులేసుకొని, కడుపు చంపుకొని అభివృద్ధి చేస్తుంటే అది చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే రాష్ట్రం అభివృద్ధిలో ముందజంలో ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇంతటి అభివృద్ధి, ఇక్కడి పథకాలు ఎందుకులేవని ప్రశ్నించారు. మోదీ గంభీరంగా ఉన్నా.. లాభం లేదన్నారు. 132 కోట్ల మంది ప్రజలదంతా అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నాడని ధ్వజమెత్తారు. రూ.85 లక్షల కోట్ల ఆస్తిని అదానీకి కూడబెట్టాడన్నారు. కానీ, పాపం పండి పది రోజు ల్లో రూ.10 లక్షల కోట్ల ఆదాయం ఆవిరైందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నా రు. కేసీఆర్‌కు విశ్వాసం ఉంటే.. మోదీ వద్ద మోసం ఉందన్నా రు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేకూరుస్తున్నాడన్నారు.
ప్రజలంతా సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండాలన్నారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధే తమ వద్ద కూడా జరగాలని పక్క రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దేశప్రజలంతా బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారన్నారు. మన రాష్ట్రంలోని గ్రామాలకే జాతీయస్థాయి అవార్డులు వస్తున్నాయన్నారు. ఆం ధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగడం లేదని, చంద్రబాబు, జగన్ ప్రజలకు చేసింది శూన్యం అని అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యాని కి పెద్దపీట వేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సోయితప్పిందని, బీజేపీకి ముఖం లేకుండా పోయిందన్నారు. ఈసారి ఎన్నికల్లో వారికి సింగిల్ డిజిట్ కూడా రాదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చాలా అభివృద్ధి చేశాడన్నారు. మంత్రి హోదాలో లేకున్నా సీఎం కేసీఆర్ సహకారంతో ఎంతో అద్భుతంగా డెవలప్మెంట్ చేశాడని, ఇదంతా చేస్తూ అసూయ కలుగుతుందన్నారు. జిల్లా ఆవిర్భావం తరువాత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మినీ ట్యాంక్‌బండ్ నాగర్‌కర్నూల్ పట్టణానికే తలమానికంగా మారిందన్నారు. ఎంజేఆర్ ట్రస్ట్ పేరిట 800కు పైగా పెండ్లిండ్లు చేసి మర్రి దంపతులు పేదల గుండెల్లో నిలిచారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయం కట్టబెట్టాలని పిలుపునిచ్చారు.
Mahabubnagar1
ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటా : ఎమ్మెల్యే మర్రి
నా వెంట ఉన్న ప్రతి కార్యకర్త, నాయకుడికి అండగా ఉంటానని ఎమ్మెల్యే మర్రి తెలిపారు. ప్రతి పేదింటి ఆడబిడ్డకు మేనమామగా ఉంటూ సమస్యల పరిష్కారంలో ముందుంటానన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి ఫలాలు గడపగడపకూ అందుతున్నాయన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి.. దేశవ్యాప్తం అయితే తమకు పుట్టగతులు ఉండవనే అక్కస్సుతో కేం ద్రం అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదన్నారు. సంపాదనలో కొంతైనా పేదవారి కోసం ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో ఉచితం గా పెండ్లిండ్లు చేయడంతోపాటు పేద విద్యార్థులకు ఫీజులు కడుతున్నట్లు చెప్పారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, పేదలకు అండగా ఉండి వారి మన్ననలు పొందడమే ఇష్టమన్నారు. మల్లారెడ్డి అన్న పాలు అమ్మి పిల్లల పోషణపై దృష్టి పెడితే.. తాను బట్టలు అమ్మి ఆత్మగౌరవాన్ని కాపాడానన్నారు.
కష్టం వచ్చినప్పుడు ఆదుకున్న వాడే నిజమైన నాయకుడన్నారు. కు టుంబాలను నాశనం చేసేవాడి వెంట ఉండడం కాకుండా అన్ని విధాలా ఆదుకునే వాడిని నమ్ముకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మర్రి సతీమణి జమున మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ మహిళలు తలెత్తుకొని జీవించేలా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదన్నారు. రాష్ట్రంపై బీజేపీ కన్నుపడిందని, ఎలాగైనా దక్కించుకోవాలని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నదన్నారు. అంతకుముందు సోషల్ మీడియా వారియ ర్స్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి దంపతుల ను సన్మానించారు. మర్రి దం పతులు కార్యకర్తలతో కలిసి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ర ఘునందన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌యాదవ్, గ్రంథాల య సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతురావు, మార్కె ట్ కమిటీ చైర్మన్ కృష్ణ య్య, జెడ్పీటీసీ శ్రీశై లం, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఈశ్వర్‌రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీలు, జె డ్పీటీసీలు, విండో చైర్మన్లు, స ర్పంచులు, ఎంపీటీసీలు, నా యకులు, కార్యకర్తలు ఉన్నారు.