ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
ఊట్కూర్, జనవరి 3 : పరిశోధనాలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నా రు. మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టీఎల్ఎమ్ మేళాను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. వి ద్యార్థులు చదువుతోపాటు పరిశోధనలపై ఆసక్తి పెంచుకొని భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆశించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్, గణిత ప్రదర్శనలను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశో క్గౌడ్, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్ మాజీ చైర్మ న్ నారాయణరెడ్డి, హెచ్ఎం సురేశ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసేందుకే తొలిమెట్టు
మరికల్, జనవరి 3 : విద్యార్థుల్లో కనీస అభ్యాసన సా మర్థ్యాలను పెంచడం కోసం ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమం చేపట్టిందని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, సర్పంచ్ గోవర్ధన్ ఆన్నారు. మండలంలోని బాలికల ఉన్న త పాఠశాలలో మంగళవారం టీఎల్ఎమ్ కార్యాక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు తయారు చేసిన బోధన, అభ్యాసన సామగ్రిని ప రిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాషా పరిజ్ఞానం, రా యడం, చదవడంతోపాటు చతుర్వేద ప్రక్రియాలు ప్రతి విద్యార్థికి వచ్చే వి ధంగా కృషి చేయాలనే ఉద్దేశంతో టీఎల్ఎమ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమంగా ఉన్న ప రికరాలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్, ఎంఈవో అంజలీదేవి, కాంప్లెక్స్ హె చ్‌ఎంలు, జిల్లా కోఆర్డినేటర్ అంజాద్, మండల కోఆర్డినేట ర్ రామలింగం, యువక మండలి అధ్యక్షుడు రవికిరణ్, ఉ పాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సామర్థ్యాల పెంపే లక్ష్యం
మద్దూర్, జనవరి 3 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపడుతుందని నోడల్ అధికారి అబ్దుల్ సమద్ అన్నారు. మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర)లో మండల స్థాయిలో మద్దూర్, కొత్తపల్లి పాఠశాలలో టీఎల్ఎమ్ మే ళాను మంగళవారం నిర్వహించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ప్రయోగాలు తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సర్పంచ్ అరుణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సి.వెంకటయ్య, ఎంఈవో గోపాల్‌నాయక్, ఆయా పాఠశాలల ప్ర ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.