ఎర్రవల్లి చౌరస్తా, జూన్ 6 : పిచ్చికుక్కల దాడిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైన ఘటన ఎర్రవల్లి మండలంలోని వల్లూరు గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం వల్లూరు గ్రామంలో ఓ పిచ్చి కుక్క చాకలి గోపి, గోపాల్, మోదిన్వి, మద్దమ్మపై మందిని గాయపర్చింది.
మరో కుక్క కూడా గ్రామంలోని ఇద్దరితోపాటు పెండ్లికి వచ్చిన మరో ఇద్దరిని గాయపర్చగా గ్రామస్తులు వాటిని వెంబండించి చంపివేశారు. అయితే కుక్కదాడిలో గాయపడిని చాకలి గోపి, గోపాల్ పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో కర్నూల్ దవాఖానకు తరలించారు. గ్రామంలో కుక్కలు పెరిగి పోయాయని వాటి నుంచి ప్రజలను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.