‘మాతరం.. వందేమాతరం.. భారత్‌మాతాకీ జై.. గాంధీజీకి జై.. నేతాజీకి జై.. జై జవాన్.. జైకిసాన్.. జై తెలంగాణ’ అన్న నినాదాలతో ఉమ్మడి మ హబూబ్‌నగర్ జిల్లా మార్మోగింది.. 78వ స్వాతంత్య్ర దినోత్సవా న్ని గురువారం ఊరూవాడా ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే పురవీధుల మీదుగా ప్రభాతభేరి సాగింది. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు.. దేశభక్తిని పెంపొందించే నినాదాలతో సమరయోధులను స్మరించుకున్నారు..
మహబూబ్‌నగర్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్‌లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, గద్వాలలో ప్రభుత్వ సలహాదారుడు జితేందర్‌రెడ్డి, నారాయణపేటలో పోలీస్ హౌసింగ్ కా ర్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, వనపర్తి కలెక్టరేట్లో షెడ్యూ ల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రీతమ్ జాతీ య జెండాలను ఎగరవేశారు.. ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.. స్వా తంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులను సన్మానించారు.. ఉత్తమ సేవలందించిన వారికి ప్రతిభా పురస్కారాలను పంపిణీ చేశారు..
– మహబూబ్‌నగర్ నెట్వర్క్, ఆగస్టు 15