ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 76వ గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. విద్యార్థుల భారతమాత, స్వాతంత్య్ర సమ రయోధుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆలరించాయి.
ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జాతీ య పతాకాన్ని ఎగురవేశారు. ధన్వాడ మండలంలోని కంసాన్‌పల్లిలో నిర్వహించిన గ్రామసభలో కాంగ్రెస్ కార్యకర్తలు పటాకులు కాల్చగా గ్రామ పం చాయతీ వద్ద ఎగురవేసిన జాతీయ జెండాకు నిప్పంటుకుంది. స్థానికులు గుర్తించి వెంటనే జెం డాను కిందకు దించి మంటలు ఆర్పివేశారు.
-నమసే తెలంగాణ నెట్వర్క్, జనవరి 26