మహబూబ్‌నగర్, ఆగస్టు 21 : రాష్ర్టాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తామని పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్ప ష్టం చేశారు. మహబూబ్‌నగర్ సమీపంలో ఆసియలోనే రెండో అతిపెద్ద, ప్రాముఖ్యత ఉం డి పునరుజ్జీవం పోసుకున్న పిల్లలమర్రి వృక్షా న్ని బుధవారం ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించి సందర్శకుల కు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం క లెక్టరేట్‌లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పిల్లలమర్రి, మినీ ట్యాంక్ బండ్, పాత కలెక్టరేట్ పరిధి లో నిర్మాణంలో ఉన్న త్రీస్టార్ హోటల్, కేసీఆర్ ఎకో అ ర్బన్ పార్కు, శిల్పారామంలో చేపట్టిన, చేపట్టాల్సిన ప నులపై సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ పిల్లలమర్రి వద్ద రెస్టారెంట్, లాండ్సేప్తోపాటు పర్యాటకులకు అవసరమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. టూరిజం అభివృద్ధిలో రాష్ట్రంలోనే పాలమూరులో మొదటి విడుత వసతుల కల్పనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా వెం టనే రూ.5 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో చేపట్టిన పర్యాటక అభివృద్ధి పనులను నిర్ధేశించిన సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే అతిపెద్దదైన కేసీఆర్ ఎకో పార్కు బా గుందన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్‌కు పర్యాటకులు ఎక్కువగా వ చ్చే అవకాశం ఉన్నదని, అందుకే అక్కడ పనులను పూర్తిచేసే విషయంపై దృష్టి సారించాలన్నారు.
అలాగే మినీ ట్యాంక్ బండ్‌ను దగ్గరలో ఉన్న కాల్వ ద్వారా కృష్ణా నీటితో నింపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అన్నారు. అలాగే మినీ శిల్పారామం, ట్యాంక్ బండ్, ఎకో పార్కులోని వాచ్ టవర్‌ను వారు సందర్శించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, పర్యాటక శాఖ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ విజయ్, పర్యాట క శాఖ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, పర్యాటక శాఖ చీఫ్ ఇంజినీర్ వెంకటరమణ, ఎగ్జిక్యూటీవ్ విజయ్, డీఈ పరుశవేది, జిల్లా పర్యాటక ఇన్చార్జి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.