
రేపటి నుంచి విద్యాలయాలు పునర్‌ప్రారంభం
కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులు
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
కొనసాగుతున్న శానిటైజేషన్ పనులు
మొదటి రోజు నుంచే మధ్యాహ్న భోజనం
కొవిడ్ జాగ్రత్తలతో ప్రారంభించేందుకు చర్యలు
మహబూబ్‌నగర్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కారణంగా మూతబడిన అన్ని విద్యాసంస్థలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇన్నాళ్లుగా ఆన్లైన్ పాఠాలు విన్న విద్యార్థులు ఇక ప్రత్యక్ష తరగతులకు హాజరుకానున్నారు. గతేడాది మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో అన్ని విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టి కేసులు తగ్గుతున్నాయని ఈ ఏడాది ఫిబ్రవరి 1న పాఠశాలలు తిరిగి ప్రారంభించినా మళ్లీ కేసుల సంఖ్య పెరగడంతో బడులు మూతబడ్డాయి. రాష్ట్రంలో లాక్డౌన్ పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి పరిస్థితులు సాధారణంగా మారుతున్న వేళ తిరిగి పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంగన్వాడీ పాఠశాలల నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. అధికారులు ఇప్పటికే అన్ని విద్యాలయాలను శానిటైజ్ చేసే ప్రక్రియ చేపట్టారు. పాఠశాలలు తెరుస్తున్న వేళ అన్ని జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా దెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా మూతబడి న విద్యాసంస్థలు బుధవారం నుంచి తెరుచుకోనున్నా యి. ఇన్నాళ్లుగా ఆన్లైన్ పాఠాలు విన్న విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా కేసులు పెరగడంతో గతేడాది మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. కేసు లు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న పాఠశాలలు తిరిగి ప్రారంభించినా మళ్లీ కేసులు పెరగడంతో నెల రోజుల్లోనే బడులు మూతపడ్డాయి. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ.. ఆగస్టులో తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణంగా మారుతున్న తరుణంలో పాఠశాలలు ప్రారంభించేందు కు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంగన్వాడీ నుం చి పీజీ వరకు అన్ని విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. విద్యాసంస్థలతోపాటు రెసిడెన్షియల్ పాఠశాలలు సైతం తెరుచుకోనున్నాయి.
అన్ని విద్యాలయాల్లో శానిటైజేషన్..
ఉమ్మడి జిల్లాలోని అన్ని విద్యాలయాల్లో శానిటైజేషన్ విజయవంతంగా పూర్తయింది. పాఠశాల ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి తరగతి గదులు శుభ్రం చేశారు. మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న పాత బియ్యాన్ని టెండర్ వేసి విక్రయించేందుకు ఓ వైపు ఏర్పాట్లు చేస్తూనే.. మరోవైపు కొత్తగా బియ్యం కోసం అధికారులు ఇండెంట్ పెట్టారు. పాఠశాలల్లో తాగునీటి ఇబ్బంది లేకుండా మిషన్ భగీరథ కనెక్షన్లు సిద్ధం చేసేందుకు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక పాఠశాలలకు నల్లా కనెక్షన్లున్నా.. లేని చోట హెచ్ఎంలు పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా నల్లా కనెక్షన్లు తీసుకునే పనుల్లో ఉన్నారు.
పీయూలో హాస్టల్స్ ఓపెన్..
రాష్ట్రంలో ఏ విద్యాసంస్థలో వసతి గృహాలు తెరవకపోయినా.. పాలమూరు విశ్వవిద్యాలయంలో మాత్రం విద్యార్థుల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హాస్టల్ ఓపెన్ చేశారు. విద్యార్థులకు పరీక్షల దృష్ట్యా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అప్పటికే యూనివర్సిటీలోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ దాదాపుగా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడంతో హాస్టల్ వెంటనే ప్రారంభించే అవకాశం ఏర్పడింది. యూనివర్సిటీ పరిధిలో సుమారు 50వేల మంది విద్యార్థులుండగా.. అందులో దాదాపుగా 500 మంది ప్రస్తుతం పీయూ హాస్టల్లో ఉంటున్నారు. విద్యార్థులంతా ప్రశాంతంగా పరీక్షలు సైతం రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
సర్వం సిద్ధం..
ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు కలిపి 4,187 ఉన్నాయి. ఇందులో 5,23,602 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 85 ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 87 గురుకులాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 33,240 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా రేపటి నుంచి బడులకు వెళ్లనున్నారు. ఆయా ప్రాంతాల్లోని పంచాయతీ సిబ్బంది, మునిసిపల్ వర్కర్లు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని గదులను శానిటైజ్ చేస్తున్నారు. అలాగే తాగునీటి కనెక్షన్లను పునరుద్ధరించారు. ట్యాంకులను శుభ్రం చేస్తున్నారు.
ప్రైవేటుకు కళ్లం వేయాలి..
ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల కార్పొరేట్ స్కూళ్లను తలపించే యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. కొవిడ్ పేరిట ఆన్లైన్ క్లాసులు బోధిస్తూ రెగ్యులర్ క్లాసుల మాదిరిగా కొన్ని చోట్ల ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు తిరిగి పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ ఫీజులు పెంచేందుకు, అదనపు ఫీజులు వడ్డించేందుకు సిద్ధం అవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారులు ఇలాంటి స్కూళ్ల యాజమాన్యాలకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.
భరోసా కల్పించాలి..
పాఠశాలలు ప్రారంభించడం మంచి దే. పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులతో సమావేశమై పిల్లల క్షేమంపై అ వగాహనతోపాటు భరోసా కల్పించాలి. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపథ్యంలో కొంత ఆందోళనకరంగా ఉన్నది. ప్రభు త్వ ఆదేశాల మేరకు నిబంధనలు పాటించాలి. ఎక్కువ విద్యార్థులున్న చో భౌతికదూరం పాటించడం కష్టం. అటువంటి పా ఠశాలల్లో షిఫ్ట్ పద్ధతిన తరగతులు నిర్వహిస్తే బాగుంటుంది.
ధరలు కూడా మరిచిపోయాం..
ఏడాదికి పైగా విక్రయాలు లేక వి ద్యాసామగ్రి గోదాంలో పెట్టినం. అడపాదడపా జరుగుతున్న వ్యాపారాలతో పలు సామగ్రిల ధరలు కూడా మార్చిపోయాం. ఎన్నో రకాల నోటు పుస్తకా లు ఎమ్మార్పీ ధరలు వేరు.. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే ఇచ్చే ధరలు వేరు. ప్రస్తుతం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం.
రెండు సీజన్లు నష్టపోయాం..
కరోనా దెబ్బకి రెండు సీజన్లు నష్టపోయాం. గతేడాది పెద్ద మొత్తంలో పె ట్టుబడి పెట్టి సరుకు తెచ్చాం. పాఠశాల లు తెరిచేసరికి ఆలస్యం కాగా, తెరిచిన కొన్ని రోజులకు వ్యాపారమేమీ జరగలే దు. ఈ ఏడాది ఇంకా సీజన్ ప్రారంభం కాకపోవడంతో నష్టాల్లో కూరుకున్నాం. పాఠశాలలు ప్రారంభం అవుతుండడంతో వ్యాపారం బాగా జరుగుతుందన్న ఆశాభావం ఉన్నది. విద్యా సంవత్సరం నిర్విగ్నంగా సాగితేనే బాగుంటుంది.