శుక్రవారం 05 మార్చి 2021
Mahabubnagar - Jan 18, 2021 , 00:57:16

క్రీడా సౌరభం

క్రీడా సౌరభం

  • నేడు రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ టోర్నీ
  • పాల్గొననున్న 10 జిల్లాల క్రీడాకారులు
  • ముస్తాబైన పాలమూరు స్టేడియం
  • బహుమతులు ఇవ్వనున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జనవరి 17 : పాలమూరులో నేటినుంచి క్రీడా పండుగ ప్రారంభంకానున్నది. జిల్లా నెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం స్టేడియం మైదానంలో అండర్‌-19 బాల, బాలికల విభాగంలో ఒక రోజు రాష్ట్ర స్థాయి జూనియర్‌ నెట్‌బాల్‌ టోర్నీ నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, నల్లగొండ జిల్లాల నుంచి 280 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. ఉదయం 6:30 గంటలకు ప్రారంభమయ్యే పోటీలను నాకౌట్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై విజేతలకు బహుమతులు అందజేస్తారని నెట్‌బాల్‌ అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఖాజాఖాన్‌ తెలిపారు. మంత్రితోపాటు డీవైఎస్‌వో శ్రీనివాస్‌, జిల్లా ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ , క్రీడా సంఘాల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు వచ్చే నెల 24 నుంచి 27 వరకు ఖమ్మంలో జరుగనున్న జాతీయస్థాయి టోర్నీలో పాల్గొంటారరు. అందరి సహకారంతో పోటీలను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. 

ఉమ్మడి పాలమూరు జట్ల వివరాలు 

బాలురు : మహ్మద్‌ ఇస్మాయిల్‌, సచిన్‌, హబీబ్‌ఖాన్‌, సంజీవ, అర్బాజ్‌, నవీన్‌ చౌహాన్‌, వహబ్‌ఖాన్‌, జయరాం, రాహుల్‌, సల్మాన్‌, సూర్య, ఆకాశ్‌.

బాలికలు : ముస్కాన్‌, ఆర్‌.స్రవంతి, అరుణ, అంజమ్మ, శివగంగ, అఖిల, స్రవంతి, స్వాతి, శ్రావణి, సాదియా, మౌనిక, వరలక్ష్మి.


VIDEOS

logo