మంగళవారం 02 మార్చి 2021
Mahabubnagar - Jan 13, 2021 , 00:28:47

వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

మహబూబ్‌నగర్‌, జనవరి 12 : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నదని, ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధింత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎస్‌వీఎస్‌, ప్రభుత్వ జనరల్‌ దవాఖాన, నేహాషైన్‌ దవాఖాన, జానంపేట పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు వారి పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు వివరించాలన్నారు. అదేవిధంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధింత అధికారులను కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు ఆదేశించారు. హెల్త్‌ప్లాన్‌ శానిటేషన్‌ ప్లాన్‌, డైనింగ్‌ ప్లాన్‌ చేపట్టాలని సూచించారు.  అనంతరం పల్లెప్రగతిపై అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లో నర్సరీలు తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ల్లో నిర్లక్ష్యం వహించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆయా శాఖలకు నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ అధికారులతో కలిసి నర్సరీల నిర్వహణపై పూర్తి స్థాయిలో ముందుకు సాగాలన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై డాక్యుమెంటరీ తయారు చేయాలని తెలిపారు. 

VIDEOS

logo