తుంగభద్రా ప్రణామం!

- చివరి రోజు పుష్కరస్నానానికి పోటెత్తిన భక్తులు
- జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు కిటకిట
- నదీహారతితో ముగిసిన పుష్కరాలు
- 4లక్షలకుపైగా భక్తుల పుణ్య స్నానాలు
- జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- తుంగభద్రకు మళ్లీ 2032లో పుష్కరాలు
తుంగభద్రా..ప్రణామం అంటూ భక్తకోటి వేడుకొన్నది. నవంబర్ 20న ప్రారంభమైన పుష్కరాలకు మంగళవారం రాత్రి వేద పండితులు తుంగభద్రకు నదీ హారతితో ముగింపు పలికారు. పుష్కరాలు చివరి రోజు కావడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు ఘాట్లకు భక్తులు పోటెత్తారు. భక్తులు నదిలో పుణ్య స్నానాలు ఆచరించి, దీపాలు వదిలి, వాయనాలు సమర్పించి, పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేశారు. వేణిసోంపురంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ శ్రీపాదులు, అలంపూర్‌లో ఎంపీ రాములు, ఎమ్మెల్యే అబ్రహం, కలెక్టర్లు శృతి ఓఝా, వెంకట్రావు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పన్నెండు రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించిన తుంగభద్ర పుష్కరాలు మంగళవారంతో ముగిశాయి.. నదీహారతితో ముగింపు పలికారు. పుష్కరాలు చివరి రోజు కావడంతో అలంపూర్ ని యోజకవర్గంలోని అలంపూర్, పుల్లూరు, రాజోళి, వేణి సోంపురం పుష్కరఘాట్లకు భక్తులు భారీగా తరలివచ్చారు.. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక నుంచి కూడా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.. నదిలో దీపాలు వదిలారు.. వాయనాలు సమర్పించారు.. పిండప్రదానాలు చేసి పితృదేవతలను స్మరించుకున్నారు.. అనంతరం భక్తులు నదీతీర ఆలయాలను దర్శించుకుని తన్మయత్వం చెందారు.. చివరిరోజు నాలుగు ఘాట్లలో 56,194 భక్తులు స్నానమాచరించారు..
- మహబూబ్‌నగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ /అలంపూర్/అయిజ
తాజావార్తలు
- పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్ ‘వాటర్ ట్యాంక్’
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
- నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల పట్టివేత
- సినిమా టికెట్ ధరల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?
- కేంద్ర ప్రతిపాదనపై రైతుల విముఖత