బుధవారం 03 జూన్ 2020
Mahabubnagar - Jan 31, 2020 , 02:03:35

ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

దేవరకద్ర, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం నియోజక వర్గ కేంద్రంలోని శ్రీ ఈశ్వర వీరప్పయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న దేవాలయ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆలయాలను పట్టించుకోక పోవడంతో ఆలయాలు అభివృద్ధి చెందలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.2.23 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 54 దుఖాణాల సమూదాయాన్ని చేపట్టనున్నామని తెలిపారు. ఆలయ స్థలంలో నిర్మాణం చేపడుతున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ అంతర్రాష్ట్ర రహదారికి సమీపంలో ఉండటంతో భవిష్యత్‌లో రోడు విస్తరణ పనులకు స్థలాన్ని వదిలి నిర్మాణాలు చేపట్టాలన్నారు. 


logo