ఖిల్లాఘణపురం, అక్టోబర్ 14 : మండలకేంద్రంలోని నవ్య దివ్య రైస్‌మిల్లుపై సోమవారం అధికారులు దాడులు చేసి 19 క్వింటాళ్ల రేషన్ బియ్యం, మారుతీ వ్యాన్‌ను సీజ్ చేశారు. ఎస్సై సురేశ్‌గౌడ్ కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌కు చెందిన పుల్లూరి రాజు, పుల్లూరి వెంకటేశ్ రేషన్ బియ్యాన్ని కిలో రూ.15 చొప్పున పట్టణంలో కొనుగోలు చేశారు.
సోమవారం ఉదయం నవ్య దివ్య రైస్‌మిల్లు యజమాని పాల్వాది లక్ష్మీనారాయణకు రూ.20 చొప్పున విక్రయించేందుకుగానూ 19 క్వింటాళ్ల బియ్యాన్ని మారుతి వ్యాన్(ఏపీ22ఎస్9992)లో తీసుకొచ్చారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో డిప్యూటీ తాసీల్దార్ నందకిశోర్ దాడులు జరిపారు. రేషన్ బియ్యంగా గుర్తించి ఖిల్లాఘణపురం పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. దీంతో బియ్యం, మారుతీ వ్యాన్‌ను సీజ్ చేసి.. డీటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.