ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాఖీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. నీకు నేను.. నాకు నువ్వు రక్ష అంటూ తోబుట్టువులు అక్క, తమ్ముళ్లకు రాఖీలు కట్టి.. స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హారతులు పట్టి కలకాలం జీవించాలంటూ దీవించారు. మార్కండేయ స్వామి ఆలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో హోమాలు జరిపించి.. గాయత్రీధారణ చేపట్టారు. బస్టాండ్ పరిసరాలు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలు టికెట్ వెనుకాల పేరు, ఫోన్‌నెంబర్ రాసి బస్టాండ్‌లోని డ్రాప్‌బాక్సులో వేశారు.
ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గురువారం హైదరాబాద్‌లో అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తోబుట్టువుల నుంచి గువ్వల ఆశీర్వాదం తీసుకున్నారు. – అచ్చంపేట, ఆగస్టు 31
జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డికి ఆయన సోదరీమణులు సద్గుణమ్మ, సువర్ణమ్మ గురువారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే స్వగృహంలో రాఖీలు కట్టారు. ఎమ్మెల్యేకు స్వీట్లు తినిపించి ఆశీర్వదించారు.
– జడ్చర్ల టౌన్, ఆగస్టు 31
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నివాసంలో ఆయన సోదరీమణులు గీత, వినీల, సుచరిత, శ్రీలత రాఖీలు కట్టారు. ఎమ్మెల్యే ఆలకు స్వీటు తినిపించి ఆశీర్వదించారు.
– భూత్పూర్, ఆగస్టు 31
అలంపూర్ మండలంలోని క్యాతూరు గ్రామ మహిళా సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5లక్షల ప్రొసీడింగ్ కాపీని మహిళా సంఘం సభ్యులకు ఎమ్మెల్యే అబ్రహం అందజేశారు.
ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
– అలంపూర్, ఆగస్టు 31
జోగుళాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి జిల్లా కేంద్రంలోని నివాసంలో ఆయన సోదరి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
– గద్వాల, ఆగస్టు 31
రాఖీ పౌర్ణమి సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు ఆయన కూతురు జ్యోతి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా స్వీటు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
– కల్వకుర్తి, ఆగస్టు 31
నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ
– నారాయణపేట, ఆగస్టు 31
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి ఎంపీపీ వనజమ్మ రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
– మక్తల్ టౌన్, ఆగస్టు 31
ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డికి రాఖీ కట్టిన ఆయన సోదరి.
– కల్వకుర్తి, ఆగస్టు 31