వనపర్తి/ఖిల్లాఘణపురం, మార్చి 31 : ‘దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు’ అని గాంధీజీ చెప్పిన మాటలకు నిదర్శనంగా స్వరాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. దీంతో మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పల్లెల ముంగిట అవార్డులు పండుతున్నాయి. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని సోలీపూర్ గ్రామం పీఎఫ్ఈఎల్పీలో రాష్ట్ర స్థాయిలో మూ డో స్థానంలో నిలిచింది. 100 మార్కులకుగానూ 96 సాధించినట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. గ్రామంలో 2,724 మంది ఉండ గా, అందులో స్త్రీలు 1,349, పురుషులు 1,375 మంది ఉన్నారు.