మహబూబ్‌నగర్, ఏప్రిల్ 1 : ప్రతిఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందు కు రావాలన్నారు. ప్రధాన చౌరస్తాలు, రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చాలని కోరారు. వడదెబ్బ కు గురికాకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవా ర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్, ఏప్రిల్ 1 : వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు దాతలు చలివేంద్రాల ను ఏర్పాటు చేయాలని డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని జాతీయరహదారిపై మండల రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రా రంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీ ల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఆర్ఐ ఖదీర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, స ర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు అల్తాఫ్, నరహరి, రమేశ్‌నాయక్, సత్యయ్య, వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల, ఏప్రిల్ 1 : మండలంలోని మాచారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ రవీందర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమం లో ఉపసర్పంచ్ రవి, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం, గోపాల్, బాలనాగయ్య, అం జయ్య, అంజలి తదితరులు పాల్గొన్నారు.