
మహబూబ్‌నగర్, అక్టోబర్ 1 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో అన్ని భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి సంజీవనిగా నిలుస్తున్నది. భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతున్నా యి. రెవెన్యూ శాఖలో అవినీతికి తా వు లేకుండా పారదర్శకత, జవాబుదారీతనం పెరిగింది. అయితే, స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న వ్యవస్థ లో మార్పును తీసుకొచ్చే క్రమంలో కొ న్ని సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. గతంలో ఏ పని చేయాలన్నా తప్పనిసరిగా పేపర్ల ద్వారానే ఉండేది. ఇప్పుడు ధరణి ద్వా రా కాగిత రహితంగా, మనుషులు నేరుగా అధికారులను కలవాల్సిన అవసరం లేకుండానే అన్ని ప్రక్రియలు పూర్తయ్యేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. ధరణి ఏర్పాటు తర్వాత రెవెన్యూ వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చాయి. ప్రతీ పని నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. అయితే, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు, నిరక్షరాస్యులు, అవగాహన లేని వాళ్లు ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మొదలైన పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికీ క్రమం తప్పకుండా ప్రభుత్వం పరిష్కారాలు చూ పిస్తున్నది. ఈ క్రమంలో ఇబ్బంది పడుతున్న వారి సమస్యలు తీర్చేందుకు మహబూబ్‌నగర్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు చేసిన ఆలోచనతో ధరణి కియో స్క్ ఏర్పడింది. మొదట నాలుగు వారాలపాటు ఏర్పాటు చేయాలని భావించినా.. ప్రస్తుతం ఆరు వారాలపాటు కొనసాగించనున్నారు.
భూ సమస్యల పరిష్కారానికి కియోస్క్..
ఒకప్పుడు ఏండ్లుగా ఉండే భూ సమస్యలతో రై తులు, ఇతరులు ఇబ్బందులు పడేవారు. యజ మానులకు తెలియకుండానే భూమి మరొకరి పేరిట మారిపోయేది. బతికి ఉన్నా చనిపోయాడని చూపించి.. వారి భూమిని మరొకరి పేరిట మార్చి న ఘటనలూ ఉండేవి. వీటన్నింటికీ సమగ్ర పరిష్కారం చూపించేందుకు సీఎం కేసీఆర్ చేసిన వి నూత్న ఆలోచన నుంచి ధరణి రూపుదిద్దుకున్నది. అయితే, దశాబ్దాలుగా ఉన్న పాత వ్యవస్థ నుంచి ఒక్క సారిగా సరికొత్త వ్యవస్థలోకి జరిగిన మార్పు ఒక్కసారిగా జనానికి అర్థం కాలేదు. అలాంటి వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నది. అయినా కొన్నిచోట్ల పరిష్కారం లభించడం లేదని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ధరణిపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మహబూబ్‌నగర్ కలెక్టర్ ఏ జిల్లా లో లేని విధంగా ధరణి కియోస్క్ ఏర్పాటు చేశా రు. ఇందులో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్, ధరణికి సంబంధించిన సిబ్బంది, ప్రతి మండలం నుంచి ఒక సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తాసిల్దార్ ఉం టున్నారు. గత నెల 27న తొలిసారి ధరణి కియో స్క్ సేవలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చా యి. ప్రతి సోమవారం ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు వేదికైన ప్రజావాణిలాగే ధరణి కియోస్క్ కూడా ప్రతి సోమవారం పనిచేస్తుంది. రెండు కంప్యూటర్లు ఏర్పాటు చేసి 20 మందికి పైగా సిబ్బంది ఫిర్యాదులకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రతి ఫిర్యాదునూ పరిశీలించి కలెక్టర్‌కు ఫైల్ పంపిస్తారు.
కలెక్టర్ సంబంధిత సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గత సోమవారం ధరణి కియోస్క్‌లో 24 మంది వినతిపత్రాలు అందజేశారు. అయితే, ఆరువారాల పాటు మాత్రమే కియోస్క్ పనిచేస్తుం ది. ఇప్పటికే ఒక వారం ముగిసింది. కాబట్టి జిల్లా లో భూసమస్యలున్న వారు సాధ్యమైనంత త్వర గా ప్రతి సోమవారం (వచ్చే 5 సోమవారాలు) కియోస్క్‌కు దరఖాస్తు చేసుకుంటే పరిష్కారం లభించనున్నది. భూ సమస్యలకు తగిన రికార్డులను పరిశీలించి మీ సేవా ద్వారా ఏ ఆప్షన్లో దరఖాస్తు చేసుకోవాలో ప్రజలకు తెలియజేస్తున్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఈ సమస్యలపై మీసేవా ద్వారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఆయా ఆప్షన్లలో దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని దరఖాస్తుదారులకు వివరిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తు తర్వాత తాసిల్దార్ లాగిన్‌కు వచ్చిన వాటిని పరిష్కరిస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం కాలేదో కూడా తెలియజేస్తున్నారు. ము ఖ్యంగా ప్రభుత్వ అసైన్డ్ భూములకు సంబంధించి ఆప్షన్ లేనందున ఆ విషయాన్ని కూడా వివరిస్తున్నారు. కియోస్క్ ద్వారా అక్కడికక్కడే పరిశీలించి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ పెం డింగ్‌లో ఉంచాల్సి వస్తే ఆ ఫిర్యాదు ఎప్పుడు పరిష్కారం అవుతుందో కూడా చెబుతున్నారు.
ధరణి కియోస్క్‌తో పరిష్కారం..
కలెక్టరేట్ లేదా తాసిల్దార్ కార్యాలయాలకు 90 శాతం మంది భూ సంబంధ సమస్యలతోనే వస్తున్నారు. వారికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపించేందుకు చేసిన ఆలోచనే ధరణి కియోస్క్. ఇంకా ఐదు సోమవారాలు ఉండే కియోస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలి. అడిషనల్ కలెక్టర్, డీఆర్వో, 20 మందికి పైగా రెవెన్యూ సిబ్బంది సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ధరణిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకొని ఉంటే స్టేటస్ చెప్పడం లేదా దరఖాస్తు చేసుకునేందుకు రాని వారికి సిబ్బంది సహకరిస్తున్నారు. వివిధ కారణాలతో బుక్ చేసుకున్న సుమారు 400 స్లాట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తుదారులు వస్తే కారణాన్ని వివరించి సమస్యను పరిష్కరిస్తాం. సమస్యలు ఉన్న వారికి మా సిబ్బంది ఫోన్ చేసి వివరాలు చెబుతున్నారు.