
మహబూబ్‌నగర్ టౌన్, అక్టోబర్ 12 : సీజనల్ వ్యాధులపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణాల్లో సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి ఆదివారం ఉదయం పదిగంటలకు పది నిమిషాలు కార్యక్రమం చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా వర్షపు నీరు నిల్వ ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు విషయంలో చర్యలు ప్రా రంభించారు. ఇప్పటికే కలెక్టర్ మున్సిపల్ అధికారులు, వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా ప్రత్యేక పారిశుధ్య పనులు, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించారు. అన్ని వార్డులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జవాన్లు, పారిశుధ్య విభాగ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమలు వృద్ధి చెందకుండా చేపలు, అయిల్ బాల్స్ వేయాల ని ఆదేశించారు. వీటితోపాటు సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఇంటితోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా అధికారులు అవగాహన క ల్పించాలని సూచించారు. వార్డు కౌన్సిలర్లు, మహిళ సం ఘాలు అందరి సహకారంతో ప్రజలకు పరిశుభ్రత విషయం లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే వార్డులో ఇంటింటికీ తి రుగుతూ వాల్‌పోస్టర్లను పంపిణీ చేశామన్నారు. ఇటీవల మం త్రి శ్రీనివాస్‌గౌడ్ స్ఫెషల్ డ్రైవ్‌ను ప్రారంభించారు.
వార్డుల వారీగా కార్యక్రమాలు
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ శాఖ చర్య లు చేపడుతున్నది. వార్డుల వారీగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలని పారిశుధ్య సిబ్బందిని ఆదేశించింది. వారానికి రోజు డ్రై డే నిర్వహించాలని నిర్ణయించింది. గతేడాది వల్లే ఈసారి కూడా కౌన్సిలర్ల సహకారంతో సీజనల్ వ్యాధుల ప్రబలకుండా పకబ్బందీగా చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేసే వారికి జరిమానా విధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పట్టణంలోని ఆయా వార్డుల్లో అదనపు కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ పర్యటించి పనులు పర్యవేక్షిస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
సీజనల్ వ్యాధులపై ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమలు వృద్ధి చెందకుండా చేపట్టాం. వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్ర త్యేక బృందాలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహ న కల్పిస్తున్నాం. జాగ్రత్తలు పాటించకుంటే దోమల వల్ల మలేరియా వచ్చే అవకాశం ఉంటుంది. నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి
-డాక్టర్ విజయ్‌కుమార్, జిల్లా మలేరియా అధికారి
వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం, ఆయా వార్డులో ప్రత్యేకాధికాలను నియమించామం, మున్సిపల్, వైద్య శాఖ కలిసి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు మున్సిపల్, వైద్యశాఖ అధికారులు సూచనలు పాటించి సహకరించాలి.
-డి.ప్రదీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్