ఊట్కూర్, ఆగస్టు 26 : వానకాలం సీజన్లో మండల రైతులు వరి పంట సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నా రు. రెండేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో వ్య వసాయ బావులు, చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరిం ది. ఈక్రమంలో రైతులు వరి పంటనే ఆసక్తి చూపుతున్నా రు. మండలంలోని చాలా గ్రామాల్లో రైతులు పొలాలను కలియ దున్నుకొని వరి నారు మడులు పోసుకున్నారు. కొ న్ని గ్రామాల్లో రైతులు వరి నాట్లు వేస్తున్నారు.
4,500 ఎకరాల్లో వరి సాగు..
మండలవ్యాప్తంగా రైతులు వానకాలం సీజన్లో 4,50 0 ఎకరాల వరి పంటను సాగు చేస్తున్నారు. గతేడాది వానకాలం, యాసంగి రెండు సీజన్లలో సైతం వరి పంటను పం డించిన రైతులు, మళ్లీ వరి సాగు చేస్తుండడం విశేషం. అలా గే మరో 41 వేల ఎకరాల్లో పత్తి, 5,870 ఎకరాల్లో కందు లు, 1,000 ఎకరాల్లో ఆముదం పంటలను రైతులు సాగు చేస్తున్నట్లు మండల వ్యవసాయాధికారులు తెలిపారు.
వరి సాగుపైనే ఆసక్తి…
రైతులు వరి సాగు చేయడంపైనే మక్కువ చూపుతున్నా రు. ఈ ఏడు సైతం నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో వరి పంటను సాగు చేస్తున్నారు. వరి సాగులో రైతులకు శ్ర మ తక్కువగా ఉంటుంది. ఈమేరకు రైతులు చెరువులు, కుంటలు, వ్యవసాయ బోరు బావులను ఆధారంగా చేసుకొని వరి సాగు చేస్తున్నారు. వరి పంట నాట్లు వేయడం, అనంతరం నీటి తడులు పెట్టడం, గొలుకలు వచ్చాక వరి కోయడంతో పంటకాలం పూర్తవుతుందని రైతులు ఆసక్తితో ఉన్నారు. చాలా గ్రామాల్లో రైతులు వరి నార్లు పోసుకొని నాట్లు వేస్తున్నారు.