
మహబూబ్‌నగర్, ఆగస్టు 16 : వక్ఫ్ ఆ స్తులను కాపాడడమే లక్ష్యంగా కమిటీ ముం దుకు సాగాలని కలెక్టర్ వెంకట్రావు అన్నా రు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వక్ఫ్ కమిటీ సభ్యులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు రద్దయిన త ర్వాత వక్ఫ్ పరిరక్షణ సమన్వయ కమిటీల ను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ, అదనపు కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్, సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడీతోపాటు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థల నుంచి ఒకరు, మహిళా సంఘం సభ్యురాలు, సీనియర్ ముస్లిం న్యా యవాది సభ్యులుగా, జిల్లా మైనార్టీ సంక్షే మ అధికారి కన్వీనర్‌గా ఉంటారని వెల్లడించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా అన్ని మండలాల్లో వక్ఫ్ భూములను గు ర్తించి పరిశీలించాలని సూచించారు. వివరాలన్నింటినీ గెజిట్‌తోపాటు బైండింగ్ చేయిం చి నివేదిక పంపించాలని తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి వక్ఫ్ ఆస్తులపై నివేదిక ఇవ్వాలని సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడీని ఆదేశించారు. కోర్టు కేసుల్లో ఉన్న వక్ఫ్ ఆస్తులపై ప్రత్యేకంగా నివేదికను రూపొందించాలని తెలిపారు. తాసిల్దార్లు ధరణి పోర్టల్‌లో వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ఎక్కడైనా వక్ఫ్ భూ ములు రిజిస్ట్రేషన్‌కు వస్తే 22ఏ కింద తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే గుర్తించిన వక్ఫ్ ఆస్తులు ఎక్కడైనా రిజిస్ట్రేషన్లకు వస్తే 22ఏసీ కింద నోటీసులు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ సభ్యులు ఖాజాఫయాజుద్దీన్, జావీద్‌అలీ, నజం ఉన్నిసాబేగం, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి శంకరాచారి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, సర్వేల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్, వక్ఫ్‌బోర్డు ఇన్చార్జి ఇన్స్పెక్టర్ అనీఫ్, సీపీవో దశరథం, అర్బన్ తాసిల్దార్ పార్థసారధి, సబ్ రిజిస్ట్రార్ జహీర్అహ్మద్ తదితరులు ఉన్నారు.
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి
ధరణి పోర్టల్‌లో నమోదైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రా వు తాసిల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి తాసిల్దార్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సక్సేషన్లో అధికంగా కేసులు పెండింగ్‌లో ఉన్నందున వా టిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించా రు. ఈ కేసుల్లో వాస్తవాలు లేకుంటే తిరస్కరించాలని చెప్పారు. ధరణి పెండింగ్ కేసులపై అదనపు కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవోలు ప్ర త్యేకంగా సమీక్షించాలని సూచించారు. వీసీ లో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజ స్ నందలాల్ పవార్, డీఆర్వో స్వర్ణలత, ఆర్డీవో పద్మశ్రీ, సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఏవో ప్రేమ్‌రాజ్ పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలపై నిర్లక్ష్యం వద్దు
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకుండా పక్కాగా ముం దుకు తీసుకెళ్లాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కాలనీల జాబితాతోపాటు గుర్తించిన సమస్యలపై నివేదిక ఇవ్వాలని సూచించారు. రూర్బన్ పథకం కింద చేపట్టిన యూనిట్లకు జాప్యం లేకుండా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలన్నారు. బృహత్ పల్లెప్రకృతి వనాలకు అదనంగా 5ఎకరాల్లో మరో నాలుగు మినీ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు భూమి కేటాయించాలని తాసిల్దార్లను ఆదేశించారు. హరితహారంలో 82శా తం మొక్కలు నాటామని, వారంరోజుల్లో వందశాతం మొక్కలు నాటాలని సూచించారు. ఆసరా పింఛన్ల వయస్సు 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించారని, 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ భవనాలన్నీ వినియోగంలో ఉండాలని సూ చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్ పవార్, డీఆర్వో స్వర్ణలత, జెడ్పీ సీఈవో జ్యోతి తదితరులు ఉన్నారు.