ఊట్కూర్, సెప్టెంబర్ 5 : కొలిచిన వారికి కొంగు బంగారమై దీవించే పులిమామిడి శ్రీరామలింగేశ్వర స్వామిని ద ర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక సంపంగోళ్ల బావి నుంచి ఊరేగింపుగా గుట్టపై వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆల యం వరకు భక్తులు భక్తిశ్రద్ధలతో జల్దిబిందె సేవ నిర్వహించారు. స్వామి వారికి పూలు, పండ్లు, నైవేద్యం సమర్పించి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. యువకులు నందికోళ, అడుగుల భజనలు వేసి చూపరులను ఆకట్టుకున్నారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం కార్యక్రమం చేశా రు. సోమవారం తెల్లవారుజామున అగ్ని గుండం, స్వామి రథోత్సవం ఉంటుందని ఆలయ ధర్మకర్త బస్వరాజ్ తెలిపా రు. జాతరలో గాజులు, ఆట వస్తువులు, మిఠాయి దుకాణాలను చిరు వ్యాపారులు ఏర్పాటు చేశారు. సర్పంచ్ సూ రయ్యగౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు వసతులను కల్పించారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన భజన సంకీర్తనలు
శ్రావణమాసం ముగింపు సందర్భం గా పట్టణంలోని సుభాశ్రోడ్డులో ఉన్న సంజీవమూర్తి ఆలయంలో శనివారం రాత్రి అవధూత మఠం భజన మండలి సభ్యులు నిర్వహించిన భజన సంకీర్తనలు భక్తులను అలరించాయి. ఆలయంలో ఆకు పూజ, అవధూతమఠంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నారాయణ, నర్సింహులుగౌడ్, దశరథ్, చంద్రకాంత్, రాము, నారాయణగౌడ్, అశోక్గౌ డ్, ఆశన్న, విశ్వనాథ్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఆంజనేయస్వామి రథోత్సవం
మండలకేంద్రంలో తెల్లవారుజామున ఆంజనేయస్వామి ఆలయం నుం చి కోట్ల ఆంజనేయస్వా మి ఆలయం వరకు ర థోత్సవాన్ని ఘనంగా ని ర్వహించారు. భక్తులు భజనలు చేస్తూ ప్రత్యేకంగా పూలతో అలంకరించిన తేరును లాగా రు. స్వామివారికి జల్దిబిందె కార్యక్రమం నిర్వహించిన అనంతరం రథోత్సవం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే స్థానిక మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి రథోత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.