కృష్ణ, సెప్టెంబర్ 6 : ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని వైద్యాధికారి శ్రీమంత్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో మెగా శిబిరం ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు, 18 ఏండ్లు పైబడిన వారికి టీకా పంపిణీ చేశారు. టీకా తీసుకున్న వారు అరగం టపాటు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాగనూర్ ప్రభుత్వ దవాఖానలో టీకా వేసుకునే వారికి కృష్ణ మండల పరిసర గ్రా మాల ప్రజలకు మరింత చేరువగా శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉపాధ్యాయులందరూ విధిగా…
ఊట్కూర్, సెప్టెంబర్ 6 : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఉపాధ్యాయులందరూ విధిగా టీకా వేయించుకోవాలని ఎంపీడీవో కాళప్ప అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయం, పెద్దజట్రం గ్రా మాల్లో కొవిడ్ మెగా శిబిరం నిర్వహించి ఉపాధ్యాయులు, 18 ఏండ్లు నిండిన యువతీ, యువకుల కు టీకా వేశారు. వందశాతం వ్యాక్సిన్ వేయడమే లక్ష్యమన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవి డ్ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటయ్య, సర్పంచులు సూర్యప్రకాశ్‌రెడ్డి, కతలప్ప, ఎంపీటీసీ కిరణ్, పంచాయతీ కార్యదర్శులు జాన్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కరోనా నుంచి రక్షించుకోవాలి
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయిసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చని 9వ వార్డు కౌన్సిలర్ మహేశ్ అన్నారు. పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన టీకా కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించా రు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఆయాలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
కొవిడ్ మెగా శిబిరం
మండలంలోని 5 సెంటర్లో కొ విడ్ మెగా శిబిరం కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి కృష్ణమాచారి, ఎంపీడీవో విజయలక్ష్మి సెంటర్లను పరిశీలించారు. 341 మందికి టీకాలు వేశారు. ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని డాక్టర్ కృష్ణమ్మ అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో…
మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో టీకా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దాదాపు 60 మందికి టీకాలు వేసినట్లు డాక్టర్ రవీందర్ తెలిపారు. కార్యక్రమాన్ని ఎంపీడీవో శశికళ సందర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆశమ్మ, కార్యదర్శి రాజయ్యగౌడ్, పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.