
జడ్చర్లటౌన్, ఆగస్టు 23 : జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు కూతవే టు దూరంలో ఉన్న పోలీస్ క్వా టర్స్ స్థలాన్ని ఆక్రమించాలని చూసిన వారిపై కేసు నమోదు చే శారు. పోలీసుల కథనం మేరకు.. జడ్చర్లలో పోలీస్ సర్కిల్ ఆఫీస్, సీఐ క్వాటర్స్ కోసం 1951లో దాదాపు 1.20 ఎకరాల భూమిని కేటాయించారు. పదేండ్ల కిందట క్వాటర్స్ భవనం శిథిలావస్థకు చేరడంతో అలాగే వదిలేశారు. ఇదే అదునుగా భావించిన కొందరు క్వాటర్స్ స్థలంలో కొంతభాగాన్ని ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించినట్లు ఆరోపణలున్నాయి. జాతీయరహదారి విస్తరణలో కొంత స్థలం వెళ్లగా.. ప్రస్తుతం నాలుగు వేల గజాల స్థలం మాత్రమే మిగిలింది. కాగా, మొహర్రం సందర్భం గా పీర్ల ప్రతిష్ఠాపన కోసం ఖాళీ స్థలంలో తాత్కాలి క రేకుల షెడ్డు వేశారు. ఆదివారం రాత్రి కొందరు యువకులు అక్కడ పీర్ల మసీదు బోర్డు పాతారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్ సోమవా రం స్థలాన్ని పరిశీలించారు. తాసిల్దార్ లక్ష్మీనారాయణను పిలిపించి స్థలం వివరాలు తెలుసుకున్నా రు. స్థలం చుట్టూ ఫెన్సింగ్ చేయించాలని డీఎస్పీ ఆదేశించారు. దీంతో మహబూబ్‌నగర్ టూటౌన్ సీఐ సోంనారాయణసింగ్, జడ్చర్ల పట్టణ, రూరల్ సీఐలు వీరాస్వామి, జములప్ప, ఎస్సైలు షంషోద్దీ న్, అభిషేక్‌రెడ్డి తాత్కాలిక షెడ్డును తొలగించి, స్థ లాన్ని చదును చేసి ఫెన్సింగ్ వేయించారు. బోర్డు పాతిన వారిపై ట్రెస్పాస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వీరాస్వామి తెలిపారు.