
మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 27 : మహబూబ్‌నగర్ ప్రధాన స్టేడియం మైదానానికి మహర్దశ రానున్నది. ఇప్పటికే రూ. 2.50 కోట్ల తో స్టేడియంలో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. అథ్లెటిక్ ట్రాక్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, ఆర్చరీ కోర్టులు ఏర్పాటు దిశగా పనులు కొనసాగుతున్నాయి. క్రీడా శాఖ మంత్రి శ్రీ నివాస్‌గౌడ్ ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రభుత్వం నుంచి రూ.6.71 కోట్ల నిధులు మంజూరు చేయించారు. దీంతో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రూ. 5 కోట్లతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడి యం పనులకు శనివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శంకుస్థాపన చేయనున్నారు. వాలీబాల్ అకాడమీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మహిళల వస తి గృహం కోసం రూ.30 లక్షలు వెచ్చించారు. బా లుర కళాశాల మైదానంలో రూ.91 లక్షలతో టెన్నిస్ కోర్టు చేంజ్ రూం నిర్మాణాన్ని మంజూరు చేయించారు. రూ.25 లక్షలతో మహబూబ్‌నగర్ జిల్లాలో బాక్స్ క్రికెట్ నిర్మాణం, మరో రూ.25 లక్షలతో హన్వా డ మండలంలో ఓపెన్‌జిమ్ ఏర్పాటు చేయనున్నారు.
స్టేడియం నిర్మాణంతో కళ
స్టేడియం మైదాన సమీపంలో ఉన్న బాస్కెట్‌బా ల్ కోర్టు నుంచి సోషల్ వెల్ఫేర్ కార్యాలయం స్థలం వరకు రూ.5 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని సకల హంగులతో నిర్మించనున్నారు. ఈ స్టే డియం ఇండోర్ గేమ్స్ ఆడే క్రీడాకారులకు ఎంతగా నో ఉపయోగపడనున్నది. ఇప్పటికే అకాడమీ పను లు చురుకుగా సాగుతున్నాయి. ఈ స్టేడియం పను లు పూర్తయితే పాలమూరుకు కొత్త కళ రానుండడంతోపాటు ఎందరో ఔత్సాహిక క్రీడాకారులకు మే లు చేకూరనున్నది. ఇప్పటికే ఉన్న వనరులతోనే కో చ్‌లు, పీఈటీలు, దాతల సహకారంతో ఎంతోమం ది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థా యిలో రాణిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషి వల్లే మహబూబ్‌నగర్ క్రీడాభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నదని డీవైఎస్వో శ్రీనివాస్ అన్నారు. ఇం డోర్ స్టేడియం పూర్తయితే హైదరాబాద్ తరహా టోర్నీలు నిర్వహించే అవకాశం ఉన్నదన్నారు.