Pak Army Chief | జర్మనీలో పాక్ ఆర్మీ చీఫ్‌కు అవమానం.. ఐడీ కార్డు లేదని అడ్డుకున్న భద్రతాధికారి
Pak Army Chief | పాకిస్థాన్ (Pakistan) ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ (Asim Munir) కు జర్మనీ (Germany) లో ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మ్యూనిచ్ (Munich) లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సుకు హాజరైన ఆయనను ఓ సెక్యూరిటీ అధికారి (Security officer) అడ్డుకున్నారు.
Pak Army Chief : పాకిస్థాన్ (Pakistan) ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ (Asim Munir) కు జర్మనీ (Germany) లో ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మ్యూనిచ్ (Munich) లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సుకు హాజరైన ఆయనను ఓ సెక్యూరిటీ అధికారి (Security officer) అడ్డుకున్నారు. ఆయన తన గుర్తింపు కార్డును సరిగా చూపించలేదని అభ్యంతరం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మునీర్ సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశించడానికి కొద్ది క్షణాల ముందు ఈ ఘటన జరిగింది. అసిమ్ మునీర్ మెడలో ఐడీ కార్డు లేకపోవడంతో సెక్యూరిటీ అధికారి ఆయనను ఆపారు. దాంతో మునీర్ పక్కనున్న మరో పాక్ సైనికాధికారి తన చేతిలో ఉన్న కార్డును చూపించడంతో.. సెక్యూరిటీ అధికారి వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఘటనపై పలువురు విమర్శకులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. అంతర్జాతీయ వేదికలపై ఆయనకున్న గౌరవం ఇదేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అసిమ్ మునీర్‌ను ఇలాంటి సదస్సులకు ఆహ్వానించడం ఏంటంటూ పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు.
#Pakistan‘s Army Chief Field Marshal Syed Asim Munir attends the Munich Security Conference 2026. pic.twitter.com/1mmCvWSGba
— The Timeline ( Timeless Tales) (@DTimeLine01) February 15, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

