
నవాబ్‌పేట, నవంబర్ 1 : ఉపాధి హామీ పథకం పనులు పారదర్శకంగా చేపట్టేందు కు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హా మీ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని డీఆర్డీవో యాదయ్య సూచించారు. 2019- 2020 సంవత్సరం, 2021 జూలై వరకు చేపట్టిన ఉపాధి హామీ పనులపై సో మవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సమీక్షకు డీఆర్డీవోతోపాటు మండల ప్రజాప్రతినిధు లు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ ఉపాధి హా మీ పనుల్లో అవకతవకలు, అక్రమాలకు పా ల్పడితే సంబంధిత వ్యక్తుల నుంచి నిధుల ను రికవరీ చేస్తామన్నారు. మండలంలో మొత్తం 54 గ్రామపంచాయతీలకుగానూ 25 గ్రామపంచాయతీల్లో మొత్తం రూ.26కోట్ల 58లక్షల 39వేల347 విలువజేసే పనులకు సామాజిక తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. మల్కాపూర్, చౌడూర్, హజిలాపూర్, వెంకటేశ్వరతండా, కామా రం, చిన్నమేఘ్యతండా, హన్మసానిపల్లి, దర్పల్లి, కొండాపూర్, పుట్టోనిపల్లితండా, జంగమయ్యపల్లి, రేకులచౌడాపూర్, దాయపంతులపల్లి, కొల్లూరు, తిమ్మయ్యపల్లి, కిషన్‌గూడ, తీగల్‌పల్లి, ఇప్పటూర్, చాకలిపల్లి, మెట్టుగడ్డతండా, కేశవరావుపల్లి, మల్లారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించామని, మిగతా గ్రామాల తనిఖీ మంగళవారం నిర్వహిస్తామని డీఆర్డీవో తెలిపారు. అన్ని గ్రామపంచాయతీలు పూర్తయి న తర్వాత సామాజిక తనిఖీ వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని న ర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, ఎంపీటీసీ రాధాకృష్ణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, విజిలెన్స్ అసిస్టెంట్ మేనేజర్ శృతి, స్టేట్ టీం మేనేజర్ అహ్మద్అలీ, ఎస్సార్పీలు చెన్నకేశవులు, భద్రు, ఏపీవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.