ఊట్కూర్, ఆగస్టు 26 : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను శుభ్రం చేయించాలని ఎంపీడీవో వెంకటయ్య అన్నారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ..సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభం కానుండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాలల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. మండలంలోని అవుసలోనిపల్లి, పెద్దజట్రం, నిడుగుర్తి గ్రామాల్లో ప్రభు త్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. పనులను ఆయా గ్రామాల సర్పంచులు కతలప్ప, హన్మంతు, య శోదమ్మ, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్రెడ్డి, వెంకట్రెడ్డి, లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు. పాఠశాలల్లో పెరిగిన గడ్డిని తొ లగించి గదులను శుభ్రం చేయించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు.
వసతి గృహాలను శుభ్రం చేయాలి
పాఠశాలల పున ర్ ప్రారంభం సందర్భంగా జిల్లా పరిధిలోని అన్ని వస తి గృహా సముదాయాలను, ఆయా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలని జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారి డి. కృష్ణామాచారి అన్నారు. జిల్లా కేంద్రంలో వస తి గృహం అధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిప ల్, పంచాయతీ సిబ్బందితో వస తి గృహం లో పల, బయట సోడియం హై పోక్లోరైట్ ద్రావ ణాన్ని పిచికారీ చేయించాలన్నా రు. అంతే కాకుండా విద్యార్థులకు తాగునీరు, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచి భౌతిక దూరం పాటించే విధంగా చూడాలన్నారు.