
మక్తల్ రూరల్, ఆగస్టు 6 : కాల్వలకు రంధ్రాలు పెట్టి నీటి చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండలంలో సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి ) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ హైలెవల్ కెనాల్ కింద రైతులకు సాగు నీటిని విడుదల చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్‌కు ఐదు చోట్ల భారీగా గండ్లు పడ్డాయని, రైతులను దృష్టిలో పెట్టుకొని మరమ్మతు పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈసారి వర్షాలు సకాలంలో రావడంతో కృష్ణానదికి వరదలు వచ్చి ప్రాజెక్టులకు పుష్కలంగా నీరు చేరిందన్నారు. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ఫేజ్-1లో అంతర్భాగమైన సం గంబండ, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపినట్లు తెలిపారు. అయితే కొందరు రైతులు కాల్వలకు రంధ్రాలు పెట్టి మోటర్లను బిగించుకొని అక్రమ పద్ధతుల ద్వారా నీటిని వినియోగించుకుంటున్నారని ఆయ న చెప్పారు. దీని వల్ల ఆయకట్టు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.
సంగంబండ రిజర్వాయర్ నుంచి నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని వివిధ గ్రామాలకు సాగునీరు అందిస్తామన్నారు. కెనాల్ పొడవునా కా ల్వలకు మోటర్ పంపులు ఉపయోగించడం వల్ల చివర ఉన్న భూములకు సాగునీరు ఎలా అందించాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కాల్వలకు గండ్లు పడితే ఒక్క రైతు కూడా ముందుకు రాలేదని, కాల్వ ల మరమ్మతులు పూర్తి అయిన వెంటనే మోటర్లు మాత్రం ఆగమేఘాల మీద అమర్చుకుంటున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. చివరి ఆయకట్టు రైతుకుల ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. కెనాల్ కింద రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని, వరి పంటలు సాగు చేయడం వల్ల నీటి ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. పట్టణంలోని మున్సిపాలిటీలో జరుగతున్న వివిధ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నా యకులు తదితరులు పాల్గొన్నారు.
ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వి విధ మండలాలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఉండి దవాఖాన ఖర్చులు చెల్లించలేని పేదలకు ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని అన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరికీ అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృ ద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రజలకు ఏ స మస్య వచ్చినా నిరంతరం అందుబాటులో అంటూ పరిష్కరిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఊట్కూర్ సింగిల్‌విండో చైర్మన్ బాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అ ధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ల క్ష్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభు త్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే చిట్టెం అన్నా రు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బుడెసాబ్ రెండేండ్ల చిన్నారి పుట్టుకతోనే మూర్ఛ వ్యాధితో బాధపడు తూ మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు, చిన్నారి వైద్య ఖర్చుల కోసం తల్లిదండ్రు లు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ.60వేల చెక్కు ను చిన్నారి తల్లి హసీనాబేగంకు అందజేశారు.