
మహబూబ్‌నగర్, ఆగస్టు 23 : దైవభక్తి ప్రతి ఒక్కరినీ సన్మార్గంలో నడిపిస్తుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్‌లో కొ లువుదీరిన రాఘవేంద్రస్వామి మఠం లో ఆరాధన మహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తె లంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆలయ పరిధిలో టాయిలెట్స్, బాత్రూంలను మంజూరు చేయాలని మంత్రికి వినతిప త్రం అందజేశారు. వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆలయ పరిధిలో టాయిలెట్స్, బాత్రూంల నిర్మాణానికి రూ.5లక్షల చెక్కు ఆలయ నిర్వాహకుల కు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ..
జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లిలో పో చమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మ్రంతి శ్రీనివాస్‌గౌడ్ హాజరై సోమవారం పూజా కార్యక్రమాలను ని ర్వహించారు. ప్రతి ఏడాది తెలంగాణలో ఆనవాయితీగా పోచమ్మ అమ్మవారికి బోనాలతో భక్తులు మొక్కులు సమర్పించుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో నేతలు, కాలనీవాసులు పాల్గొన్నారు.