
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 11 : దివ్యాంగులమని దిగులు చెందకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ల క్ష్యంతో ముందుకు సాగాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం, శనివారం జిల్లా లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, వార్డు కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.7.80 లక్షలతో కొనుగోలు చేసిన 10 బ్యా టరీ స్కూటీలను, ట్రైసైకిళ్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ లబ్ధిదారులకు అందజేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని 11, 15, 16, 24, 25, 27, 28, 44, 42, 45, 47, శుక్రవారం 32, 48 వార్డు కమిటీ నూతన కార్యవర్గ స మావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ దివ్యాంగులకు ఏ అవసరం వచ్చినా అండగా ఉం టామని, ఆత్మైస్థెర్యంతో అడుగులు వేసి కలలను నిజం చేసుకోవాలన్నారు. పట్టదలతో ప్రయాణం ఆరంభిస్తే విజయం మీ వెంటే ఉంటుందన్నారు. వికలాంగులకు ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తుందని, ఇప్పటికే పలువురికి ఉద్యోగాలు కల్పించామన్నారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతుందన్నారు. అర్హులైన వారందరికీ డ బుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని, ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే కొత్త పింఛన్లు ఇస్తామన్నారు. కొంద రు వ్యక్తిగతంగా ఆరోపణలు చే స్తున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. పార్టీ పటిష్టత ను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
పలువురితో ప్రత్యేకంగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రతి సమస్య నూ పరిష్కరిస్తామన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో ని వీవీ కన్వెషన్ హాల్లో డాక్టర్ వివేకం జ్ఞాపకార్థం ఏ ర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హా జరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అలాగే నర్సగౌడ్కు రూ.3.50 లక్షలు, ఎల్లయ్యకు రూ.1.50 లక్షలు సీఎం సహాయనిధి నుంచి మంజూరు కాగా, అట్టి చెక్కులను బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతికి హాజరయ్యారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి తెలిపారు.
ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి..
గణేశ్ ఉత్సవాలను కులమతాలకతీతంగా ప్రశాంతం గా నిర్వహించుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాలమూరు గణేశ్ ఉత్సవ సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి పూజలు చేశారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన మట్టి వినాయకులను పంపిణీ చేశారు. అనంతరం విఘ్నేశ్వర కాలనీలో, కలెక్టరేట్లో, పాతపాలమూరులో, క్లాక్‌టవర్ వద్ద వినాయక విగ్రహాలకు పూ జలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చై ర్మన్ గణేశ్, ఎస్ఎన్జీ చైర్పర్సన్ శ్రీహిత, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, డీ ఎస్పీ శ్రీధర్, కౌన్సిలర్లు మాధవి, లత, గోవిందు, మోతిలాల్, రాషాద్ఖాన్, మునీరొద్దీన్, శ్రీను, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఇందిర, డీడబ్ల్యువో రాజేశ్వరి, డాక్టర్ శామ్యూల్, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ వివేకం కుటుంబ సభ్యులు, నాయకులు చిన్నా, శరత్చంద్ర, వెంకట్రాములు, మోసిన్, ప్రభాకర్, సాయిలు, ఖాదర్‌పాషా, రాజు, రాందాస్, చెన్నయ్య, కుమారస్వామి, రా ము, నవకాంత్, మాల్యాద్రిరెడ్డి, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
చెక్‌డ్యాంలతో పుష్కలంగా భూగర్భజలాలు
చెక్‌డ్యాంల నిర్మాణాలతో భూగర్భజలాలు పుష్కలంగా పెరుగుతున్నాయని మం త్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వేపూర్ గ్రామంలో రైతువేదిక, శశ్మానవాటిక, పల్లెప్రకృతి వనం, రూ.3.46 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్ద తు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. కూరగాయల సా గుపై మొగ్గు చూపాలని తెలిపారు. కార్యక్రమంలో ఎం పీపీ బాలరాజ్, సర్పంచ్ సత్యమ్మ, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజుయాదవ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, నాయకులు లక్ష్మయ్య, జం బులయ్య, బాలయ్య, నరేందర్, యాదయ్య, ఖాజాగౌ డ్, ఆనంద్, హరిచందర్, రమణారెడ్డి పాల్గొన్నారు.