
శ్రీరంగాపురం, సెప్టెంబర్5: గ్రామాలు దేశానికి పట్టు గొమ్మలు అనే నినాదానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. దేశంలో ఏ గ్రామ పంచాయతీకి నేరుగా నెలనెలా నిధులు పంపిస్తున్న దాఖలాలు లేవని, తెలంగాణలో ప్రతి నెలా సర్కారు నౌకర్ జీతాల మాదిరిగా గ్రామ పంచాయతీలకు నిధులను పంపిస్తూ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఆదివారం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని దళిత వాడలో రూ.16లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీపీ గాయత్రి, స్థానిక నాయకులతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంతో పార్కులు, కరెంట్ స్తంభాలు, డ్రైనేజీలను నిర్మించుకున్నామన్నారు. గ్రామ పంచాయతీగా ఉన్న శ్రీరంగాపురాన్ని ముఖ్యమంత్రితో చర్చించి మండల కేంద్రంగా మార్చి, పలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీరంగ నాయక స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా కంచిరావుపల్లి నుంచి దేవాలయం వరకు డబుల్ రోడ్డు వేశామన్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన త్వరలో ఉన్న నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు హామీ తీసుకుంటానని మంత్రి వెల్లడించారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి టిఫిన్ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు గౌడనాయక్, జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, సర్పంచులు, ఎంపీటిసీలు, పృథ్వీరాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి కొనసాగుతున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 1,2,4,5వ వార్డుల్లో రూ. 30 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, రూ.14.26లక్షలతో వైకుంఠ రథం, రూ.8.85లక్షలతో ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్లను మున్సిపల్ నిధులతో కొనుగోలు చేయగా, వాహనాలను మున్సిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం తడిచెత్త, పొడిచెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలు, పల్లెలను సంపూర్ణంగా అభివృద్ధి పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మున్సిపాలిటీకి వచ్చే నిధులతో మిగతా వార్డుల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్య పనులు చేపడుతామన్నారు. పీజేపీ కార్యాలయ ఆవరణలో వనపర్తి, నల్గొండ జట్ల మధ్య జిల్లా స్థాయి ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్యామల, మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, కమిషనర్ జాన్ కృపాకర్, కౌన్సిలర్లు పద్మ, సువర్ణ, పార్వతి, రామకృష్ణ, ఎల్లారెడ్డి, గోపి, కో ఆప్షన్ సభ్యులు ముస్తాక్, ఐజాక్, మార్కెట్ డైరెక్టర్లు భారతి, రాము, నాయకులు బుచ్చారెడ్డి, విశ్వరూపం, రాములు, సాయినాథ్, గోపాల్, వెంకటయ్య, దిలీప్‌కుమార్‌రెడ్డి, మజీద్, రాజశేఖర్‌గౌడ్ తదితరులున్నారు.
బోధించడం ఓ కళ..
విద్యార్థుల మస్తిష్కం నుంచి గౌరవం పొందినప్పుడే ఉపాధ్యాయులకు నిజమైన సత్కారం లభిస్తుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 23మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువా, పూలమాలతో సన్మానించారు. అంతకుముందు కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషా, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, డీఈవో రవీందర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుడు మార్పును అన్వయించుకొని విద్యాబోధన చేయాలని, బోధించడం ఓ కళ అని అన్నారు. ఉపాధ్యాయులు స్వేచ్ఛాయుత పద్ధ్దతిలో బోధన చేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు, జీహెచ్ఎంలు, హెచ్ఎంలు, అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
రైతులకు అవగాహన కల్పించాలి
జిల్లాలోని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు సాగులో మరిన్ని మెళకువలు తెలియజేసే కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నాగవరం శివారులో నిర్మించిన అగ్రికల్చర్ ఏడీ కార్యాలయ భవనాన్ని మంత్రి కలెక్టర్ షేక్యాస్మిన్బాషాతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు ఆర్థిక అభివృద్ధిలోకి వచ్చేలా రైతు వేదికల ద్వారా సదస్సులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏడీ పూర్ణచందర్, పీఆర్ ఏఈ మల్లయ్య, మన్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, రైతుబంధు సమితి మండల నాయకుడు నరసింహ, మార్కెట్ వైస్‌చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, నాగవరం సహకార సంఘం చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బాలకృష్ణ, జయరాములు, బాలకృష్ణ, శ్రీను, మాణిక్యం,అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.