
మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 6 : కొత్త జిల్లాల ప్రాతిపదికన త్వరలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తెలిపారు. శుక్రవా రం పీఆర్టీయూ టీఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లాలోని అ న్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వారీగా పదోన్నతులు, బదిలీల విషయంలో న్యాయపరమైన చిక్కు లు ఉన్నందున, కొత్త జిల్లాల వారీగా క్యాడర్ స్ట్రెంత్‌ను ని ర్ధారించి త్వరలో షెడ్యూల్ వెలువరించేలా కృషి చేసినట్లు తెలిపారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీ పాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణగౌడ్, రఘురాంరెడ్డి, జి ల్లా గౌరవాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ముజీబుర్ రహమాన్, తిమ్మారెడ్డి, మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, గోపాల్‌గౌడ్, రా ష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, రేవతి, బుచ్చారెడ్డి, ఎల్లయ్య, రాజశేఖర్‌గౌడ్, వెంకటేశ్వర్రావు, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని ఎమ్మెల్యే ఎస్.రా జేందర్‌రెడ్డి అన్నారు. పీఆర్సీ, మహిళా ఉపాధ్యాయులకు ప్రసూతి సెలవులు మంజూరు, ఎస్ఎస్ఏ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు 30 శాతం ఫిట్మెంట్ ఇప్పించడం వంటి సమస్యల ను పరిష్కరించడంలో కీలక పాత్ర పో షించిన ఎమ్మెల్యేను పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో అభినందన సన్మానోత్స వ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని జిల్లా కేంద్రం అంజనా గార్డెన్స్‌లో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే దక్కుతుందని, అలాంటి వృత్తిని చేపట్టడం కొంత మందికే లభిస్తుందని పేర్కొన్నారు. పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం అంటే తనకు ఎంతో అభిమానమన్నారు.
ఉపాధ్యాయులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడం లో తాను ముందుంటానన్నారు. ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయినులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల మంజూరు ఉ త్తర్వులను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. పీఆర్టీయూ టీఎ స్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ ఉ ద్యోగులకు కుటుంబ పింఛన్ కల్పించాలని, త్వరలోనే కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు ఉంటాయన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపాల్ చైర్పర్సన్ అనసూ య, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, పీఆర్టీయూ టీఎస్ నాయకులు పాల్గొన్నారు.