
ఆత్మకూరు/అయిజ/శ్రీశైలం, ఆగస్టు 27 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతున్నది. ఐదు రో జులుగా స్థిరంగా కొనసాగిన ఇన్‌ఫ్లో శుక్రవారం కొంతమేర తగ్గుముఖం పట్టింది. ఇన్‌ఫ్లో 11 వేల క్యూసెక్కులు నమోదుకాగా విద్యుదుత్పత్తికి 7,971 క్యూసెక్కు లు విడుదల చేస్తున్నారు. దీంతో ఎగువ జూరాల, దిగువ జూరాలలో ఒక్కో యూనిట్ చొప్పున విద్యుత్ ఉత్పత్తి ని ర్వహిస్తున్నారు. ఎగువ జూరాలలో ఒక యూనిట్‌తో శుక్రవారం 1.848 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగగా ఇప్పటి వరకు మొత్తంగా 114.485 మిలియన్ యూనిట్లు జరిగింది. దిగువ జూరాలలో ఒక్క యూనిట్ ద్వారా 2.32 ఎంయూ ఉత్పత్తి జరుగగా, మొత్తంగా 123.02 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ఎ డమ కాలువకు 920, కుడి కాలువకు 608, సమాంతర కాలువకు 850, భీ మా ఎత్తిపోతల (రెండు) 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఔట్‌ఫ్లో 10,438 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూర్థిస్థాయి సామర్థ్యం 9.657 టీ ఎంసీలు ఉండగా 8,591 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
తుంగభద్ర జలాశయానికి..
కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న వా నలకు తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. శుక్రవారం ఇన్‌ఫ్లో 4,009 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 14,3 02 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజె క్టు పూర్తిస్థాయి సామర్థ్యం 100.855 టీ ఎంసీలు ఉండగా ప్రస్తుతం 98.508 టీ ఎంసీలు నిల్వ ఉన్నాయి. మొత్తం నీటిమట్టం 1633 అడుగులకుగానూ ప్రస్తు తం 1632.39 అడుగులకు చేరినట్లు సె క్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నీరు నిలకడగా కొనసాగుతున్నది. శుక్రవారం 10,743 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 10,300 వేల క్యూసెక్కు లు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుం కేసుల బ్యారేజీకి చేరుతున్నదని ఏఈ శ్రీ నివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 9.1 అడుగుల మేర నీటిమట్టం ఉండ గా.. ప్రధాన కాల్వకు 443 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీశైలం @ 876.10 అడుగులు
కృష్ణానది పరీవాహక ప్రాంతాల నుంచి వరద పూర్తిగా నిలిచిపోయింది. దీంతో శ్రీశైలం జలాశయం 876 అడుగులకు చేరింది. శుక్రవారం జూరాల ప్రా జెక్టు విద్యుదుత్పత్తి నుంచి 7,971, సుంకేశుల నుంచి 4,311, మొత్తం కలిపి 12,282 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. కాగా సాయంత్రానికి శ్రీశైలం డ్యాంకు 16,638 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో 31,784 క్యూసెక్కులు వినియోగించి ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.10 అడుగులకు చేరింది. సామ ర్థ్యం 215.80 టీఎంసీలు ఉండగా ప్ర స్తుతం 168.66 టీఎంసీలు నిల్వ ఉ న్నట్లు అధికారులు తెలిపారు.