
జడ్చర్ల, ఆగస్టు 6 : జీవాల ఆరోగ్యంపై పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య అన్నారు. శుక్రవారం జడ్చర్ల మండలం లింగంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ హైమావ తి, పశువైద్యురాలు సుప్రియ, వెంకట్‌రెడ్డి, వార్డుసభ్యుడు బాలు పాల్గొన్నారు.
నట్టల నివారణతోనే ఎదుగుదల
జీవాల్లో నట్టల నివారణతోనే ఎదుగుదల ఉంటుందని ము న్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నా రు. మున్సిపాలిటీలో గొర్రెలు, మేకలకు న ట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమా న్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ పీ కదిరె శేఖర్‌రెడ్డి, మండల పశువైద్యాధికా రి మధుసూదన్, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు నర్సింహగౌడ్ పాల్గొన్నారు.
జీవాలను కాపాడుకోవాలి
సీజనల్ వ్యాధుల బారి నుంచి జీవాలను కాపాడుకోవాలని అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డి, మూసాపేట జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగ ర్ సూచించారు. ఆయా మండలాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. కా ర్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్ పాల్గొన్నారు.
కాపరుల అభివృద్ధికి కృషి
గొర్రెలు, మే కల పెంపకందారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని సర్పంచ్ మాధవీరెడ్డి అ న్నారు. మండలంలోని అభంగపట్నం గ్రా మంలో జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటయ్య, గోపాలమిత్ర రామకృష్ణ ఉన్నారు.
నాలుగోవార్డు ఎదిరలో..
జిల్లాకేంద్రంలోని నాలుగోవార్డు ఎదిరలో కౌన్సిలర్ యాదయ్య జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో గొర్రెల పెం పకందారుల సంఘం అధ్యక్షుడు సూద న ర్సింహులు, నాయకులు హన్మంతు, అల్లీ ఎల్లయ్య, అల్లీ శేఖర్, వీరస్వామి, బాల య్య, శ్రీశైలం, యాదయ్య పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
మండలంలోని కొల్లూరు, దేపల్లి, చౌడూర్, రంగంపల్లి గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. ఆయా గ్రామాల్లో 3,944 గొర్రెలు, 790 మేకలకు నట్టల ని వారణ మందు వేసినట్లు పశువైద్య సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సౌజ న్య, లత, ఎంపీటీసీ తుల్సీరాంనాయక్, ప శువైద్యాధికారులు రవిచంద్ర, స్వప్న, నా యకులు చందర్‌నాయక్, నాగ నర్సింహు లు, రఘు, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
మండలంలోని గౌతాపూర్ పశువైద్య కేంద్రంలో గొర్రె లు, మేకలకు నట్టల నివారణ మందులు వేశా రు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, పశు వైద్యసిబ్బంది అరుణ పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
జీవాలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి మౌనికారెడ్డి సూచించారు. మండలంలోని షేక్‌పల్లి, ఎల్లబాయితండా, వేపూర్, లింగన్నపల్లి గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో సర్పంచులు సత్యమ్మ, శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ రాఘవులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
మండలంలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాలను గొర్రెలు, మే కల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి శ్రావణి అన్నారు. శుక్రవారం మండలంలోని వాడ్యాల్, కొత్తపల్లి గ్రామాల్లో జీవాలకు నట్టల నివారణ మందు తాగించారు. కార్యక్రమంలో పశువై ద్య సిబ్బంది రాములు, సాగర్ ఉన్నారు.