
మక్తల్ రూరల్, ఆగస్టు 6 : టీఆర్ఎస్ పార్టీ సిద్ధ్దాంత కర్త, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర వ హించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుక లు శుక్రవారం పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జయశంకర్ సార్ సీఎం కేసీఆర్‌తో గంటల తరబడి చర్చించేవారన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాల సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే తాసిల్దార్ కార్యాలయంలో జయశంకర్ జయంతి వే డుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తాసిల్దార్ నరసింగరావు, ఆర్ఐ శ్రీశైలం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పితామహుడు జయశంకర్ సార్
తెలంగాణ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి అధికారులు, ప్ర జా ప్రతినిధులు, ఉద్యోగులు ఘనంగా నివాళులర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ల క్ష్మి, తాసిల్దార్ కార్యాలయంలో తిరుపతయ్య, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచులు సూర్యప్రకాశ్‌రెడ్డి, మాణిక్యమ్మ, సుమంగళ, ప్రధానోపాధ్యాయుడు నర్సింగప్ప పాల్గొని మాట్లాడారు. కార్యక్రమం లో ఎంపీడీవో కాళప్ప, కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
తెలంగాణ సిద్ధ్దాం త కర్త ప్రొ జయశంకర్ ఆశయాలకనుగుణంగా బంగా రు తెలంగాణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. జ యశంకర్ జయంతి సందర్భంగా పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వే సి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప, సిబ్బంది పాల్గొన్నారు.
ఆశయ సాధనకు కృషి చేయాలి
జయశంకర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చే యాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ జీవితంలోని సిద్ధ్దాంతాలను నేటి యువత అనుకరించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వె నుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి కృష్ణమాచారి, ఏవో ఖలీద్, జిల్లా అధికారులు తదితరులు పా ల్గొన్నారు. అదే విధంగా పట్టణంలోని మోనప్ప గుట్ట వద్ద విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జ యశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా దవాఖానలో రోగులకు, చి న్నారులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమం లో గోవిందాచారి, సౌభాగ్య, రాజన్నచారి, రఘుచారి, నాగేందర్, శరణప్ప, మౌనేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
సార్ స్ఫూర్తి ఎంతో గొప్పది
ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో నింపిన స్ఫూర్తి ఎంతో గొప్పదని తాసిల్దార్ సురేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిజామొద్దీన్ అన్నారు. మండలకేంద్రం లో తాసిల్దార్ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాలలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్ఐ వెంకట్రాములు, వీఆర్వోలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో…
మండలంలోని వివిధ గ్రా మాల్లో జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘ నంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో తాసిల్దార్ వెంకటేశ్, ఆర్ఐ, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో…
జయశంకర్‌సార్ జయంతి వేడుక లు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జయశంకర్ వేడుకలు చేపట్టారు. తెలంగాణ సిద్ధ్దాంతకర్త, స్ఫూర్తి ప్రదాత జయశంకర్ అని ఆయన సేవలను గుర్తు చేశారు.
అడుగుజాడలో నడువద్దాం
జయశంకర్ అ డుగుజాడలో నడువద్దామని డీఈవో లియాఖత్ అలీ అన్నారు. జయశంకర్ జయంతిని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంతోపాటు ఎమ్మార్సీ, తాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఈవో లియాఖత్ అలీ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఆహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఏఎంవో విద్యాసాగర్, జీసీడీవో పద్మనళిని, వివిధ శా ఖల అధికారులు, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
యువత ఆదర్శంగా తీసుకోవాలి
జయశంకర్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ అన్నారు. జయశంకర్ జయంతిని పు రస్కరించుకొని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ న ర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జగదీశ్, ము న్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చేతన జయశంకర్ చి త్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, ఎస్బీ ఎస్సై రా జు, సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ భాస్కర్‌రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, కౌన్సిలర్లు, సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.
నర్వ మండలంలో…
జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని సింగిల్విం డో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆ యన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో రమేశ్‌కుమార్, సీనియార్ అసిస్టెంట్ రాఘవేందర్, ఆయా గ్రామాల కార్యదర్శులు, ఐకేపీ, ఈజీఏస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సేవలు మరువలేనివి
జయశంకర్ సార్ సేవలు మరువలేవని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్ అ న్నారు. పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ని వాళులర్పించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు శాలం, గో వింద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో…
పట్టణంలోని మౌనేశ్వర స్వామి ఆలయ ఆవరణలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ జ యంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటాని కి విశ్వకర్మలు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి సాయిజ్యోతి వెంకటేశ్, కోశాధికారి నరేశ్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, కృష్ణ మండ ల అధ్యక్షుడు కృష్ణయ్య, సభ్యులు పాల్గొన్నారు.