నారాయణపేట, ఆగస్టు 26 : ప్రస్తుత పోలీసు వ్యవస్థలో మహిళల ప్రాధాన్యత, అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై నారాయణపేట సర్కిల్ ఇన్చార్జి, సీఐ ఇఫ్తెకార్ అహ్మద్ ఆధ్వర్యంలో గురువారం నారాయణపేట, దామరగిద్ద పోలీసులకు జండర్ సెన్సిటైజేషన్‌పై హైదరాబాద్‌కు చెందిన ‘చిందు’ సంస్థ సభ్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భ ంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ సమాజంలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల చాలా మంది అనారోగ్యానికి, నిరూత్సాహానికి గురవుతున్నారన్నా రు. అలా కాకుండా పోలీసులు నూతన ఉత్తేజంతో పని చేయడానికి ప లు సూచనలు చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సురేశ్, సబ్రిన ఫ్రాన్సిస్, నారాయణపేట ఎస్సై సైదులు, దామరగిద్ద ఎస్సై గోవర్ధన్లతోపాటు పోలీసులు పాల్గొన్నారు.
దూర దృశ్యపై ఒకరోజు సమావేశం…
దూర దృశ్య సమీక్షపై కమ్యూనిటీ పోలీసింగ్ వర్టికల్ ఇన్చార్జి, సీఐ శివకుమార్ జిల్లాలోని పోలీసు అధికారులకు, సిబ్బందికి దూర దృశ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పోలీసులు తమ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, వాణిజ్య సంస్థలు, కాలనీ అసోసియేషన్స్, వెల్ఫే ర్ అసోసియేషన్స్, అపార్ట్మెంట్ కమిటీలతో నిరంతరం సమావేశాలు నిర్వహించాలన్నారు. సమాజంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాల గు రించి వివరించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నేర నిరోధక చ ర్యల్లో భాగంగా స్థానిక గ్రామ ప్రజలను భాగస్వాములను చేస్తూ నేర ని యంత్రణలో సీసీ టీవీల ప్రాముఖ్యత తెలుపాలన్నారు. తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పడానికి ఎంతో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లోని పోలీసు అధికారు లు, సిబ్బంది పాల్గొన్నారు.