
మహబూబ్‌నగర్, ఆగస్టు 7 : చేనేత కార్మికులకు చే యూతనందించేందుకు వారంలో ఒక రోజు చేనేత వ స్ర్తాలను కుటుంబ సభ్యులందరూ ధరించేలా చర్యలు తీ సుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజా లో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ని ర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హా జరై మాట్లాడారు. చేనేత వస్ర్తాలను ధరించడంతో ఆరోగ్యంతోపాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపా రు. చర్మవ్యాధులు రావని, శరీరాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచేందుకు వస్ర్తాలు ఎంతో ఉపయోగపడుతాయన్నా రు. జిల్లా కేంద్రంలో టెస్కో షోరూంతోపాటు బ్రాంచ్ లు ఏర్పాటు చేసే విషయంపై దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు సూచించారు. దేవరకద్ర మండలం వెంకటయ్యపల్లికి చెందిన శ్రీ లక్ష్మీవెంకటేశ్వర చేనేత ఉన్ని పరిశ్రమ సహకార సంఘానికి పావలా వడ్డీ కింద రూ.10.83 లక్షల చెక్కును అందజేశారు. 11 మంది చేనేత సహకార ప్రతినిధులను శాలువాతో సత్కరించారు. కవయిత్రి పులి జమున రచించిన నేత మొ గ్గలు పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా మీదుగా నిర్వహించిన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్‌కుమార్, చేనేత సంక్షేమ శాఖ జిల్లా అధికారి బాబు, వైస్ చైర్మన్ గణేశ్, జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ రామలింగం, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, కవులు శ్రీకాం త్, గిరిజారమణ, చేనేత సంఘాల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సభ్యులు రాములు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.