ఆత్మకూరు, అక్టోబర్ 1 : ఉమ్మడి జిల్లా కల్పతరువు జూరాల జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉవ్వెత్తున ప్రవహిస్తున్నది. గురువారం రాత్రి వరకు లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కాగా శుక్రవారం ఉదయానికి క్రమంగా త గ్గింది. రాత్రికి 66 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో డ్యాం 2 గేట్లు ఎత్తి 14,128 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయకట్టు అవసరాలు తీర్చేలా, తాగునీటి పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 773, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు వదులుతున్నారు. విద్యుదుత్పత్తికి 43,828 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఎగువ జూరాల కేంద్రంలో 6 యూనిట్ల నుంచి 3.710 మి.యూ. ఉత్పత్తి జరుగగా ఇప్పటి వరకు మొత్తంగా 227.871 మి.యూ. ఉత్పత్తి జరిగింది. దిగు వ జూరాల కేంద్రంలో 6 యూనిట్లలో 4.074 మి.యూ. ఉత్పత్తి జరుగగా మొత్తంగా 253.915 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి కొనసాగింది. ప్రాజెక్టు సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా రాత్రికి 8.909 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మొత్తంగా 60,540 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదయ్యాయి.
టీబీ డ్యాంకు తగ్గుదల..
అయిజ, అక్టోబర్ 1 : తుంగభద్ర డ్యాంకు వరద త గ్గుముఖం పట్టింది. శుక్రవారం ఇన్‌ఫ్లో 6,200, అవుట్‌ఫ్లో 10,603 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూ ర్తిస్థాయి సామర్థ్యం 100.855 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 98.855 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 1633 అడుగులకుగానూ 1632.48 అడుగులకు చేరిందని టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా చేరుతున్నది. ఇన్‌ఫ్లో 4,329 క్యూసెక్కులు ఉండగా.. 3,900 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నట్లు ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 8.6 అడుగుల మేర నీటి మట్టం ఉండగా.. ప్రధాన కాల్వకు 429 క్యూసెక్కు లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
కోయిల్‌సాగర్‌కు జలకళ
మండలంలోని సా గునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌కు స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో శుక్రవారం ఒక గేటు తెరిచి దిగువకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ప్రాజె క్టు ఈఈ ప్రతాప్‌సింగ్ తెలిపారు. సాగర్‌లో 32.6 (2.27 టీఎంసీలు సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 2.25 టీఎంసీలు నిల్వ ఉన్నాయి) అడుగులకుగానూ 32 అడుగులు నమోదైంది.
శ్రీశైలం డ్యాం @ 85,213 క్యూసెక్కులు
శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతున్నది. ఎగువనున్న జూరాల ప్రాజెక్ట్ నుంచి 70,023 క్యూసెక్కులు రిజర్వాయర్‌కు వచ్చి చేరుతున్నాయి. దీంతో శ్రీశైలం ఎడమ, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. అవుట్‌ఫ్లో 66,413 క్యూసెక్కులు నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమ ట్టం 885 అడుగులకుగానూ 883.40 అడుగులకు చే రగా.. సామర్థ్యం 215 టీఎంసీలకుగానూ 206.97 టీఎంసీలు నిల్వ ఉన్నాయని అధికారులు తెలిపారు.