
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 6 : కార్యకర్తలే పార్టీకి బలమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం కాటవరం గ్రామంలో సోమవారం టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎమ్మెల్యే సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్ర జా సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందేలా టీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలన్నా రు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. కాగా, కాటవరం గ్రామ అ ధ్యక్షుడిగా కొండన్న, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా శ్రావణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాఖాపూర్ గ్రామంలో కూ డా టీఆర్ఎస్ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. అంతకుముందు గ్రామంలోని ఆలయంలో ఎమ్మెల్యే ఆల ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా శాఖాపూర్‌లో గుండెపోటుతో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మైబు కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు.
సీఎం కేసీఆర్ పాలన చారిత్రాత్మకం
ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చరిత్రాత్మకమని ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. కాటవరంలో వివిధ గ్రా మాలకు చెందిన 32మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే 9మందికి రూ.4,21,200 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయని తెలిపారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్ పబ్లిసిటీ కోసం పాకులాడే వ్యక్తి అని విమర్శించారు. బండి సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్పై, పరిపాలనపై విమర్శలు మానుకొని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను చూడడంతోపా టు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలువాలని సూచించా రు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి, మండల ఇన్చార్జి సాక బాలనారాయణ, భీంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, జయన్నగౌడ్ పాల్గొన్నారు.