
మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 8: ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుడు నీరజ్‌చోప్రా జావెలిన్‌త్రో విభాగంలో 87.36 మీటర్లు విసిరి స్వర్ణపతకం సాధించడంతో స్టేడియం మైదానంలో ఆదివారం సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేట్‌కట్ చేశారు. కార్యక్రమానికి వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్‌గౌడ్, సెంట్రల్ ఇంటలిజెన్స్ సీఐ రాజీవ్‌కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు, వాలీబాల్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నవీరయ్య హాజరై మాట్లాడారు. వందేండ్ల అథ్లెటిక్స్‌లో భారత్ స్వర్ణం సాధించడం సంతోషంగా ఉందన్నారు. నీరజ్‌చోప్రా అద్భుతం చేశాడని కొనియాడారు. కార్యక్రమంలో టేబుల్ టెన్నీస్ సంఘం కార్యదర్శి దామోదర్‌రెడ్డి, ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి గజానంద్, సాఫ్ట్‌బాల్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కబడ్డీ సంఘం కార్యదర్శి కురుమూర్తి, తైక్వాండో అధ్యక్షుడు దేవీదాస్, సాఫ్ట్ట్‌బాల్ కోచ్ సాధిక్‌అలీ, అథ్లెటిక్ కోచ్‌లు ఆనంద్, సునీల్‌కుమార్, కోచ్‌లు ఖలీల్, సాయిలు, కృష్ణ, యాదయ్య, నర్సింహ, చారి, పీఈటీలు శ్రీనివాస్, రాజు, దత్తాత్రేయ, శ్రీనివాస్, శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు.