
ఊట్కూర్, ఆగస్టు 10 : మండలంలోని మల్లేపల్లి, సంస్థాపూర్, కొల్లూర్ గ్రామాల్లోని దళితవాడల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంగళవారం అధికారు లు సర్వే చేశారు. ఆయా గ్రామాల్లో ఎంపీడీవో కాళప్ప ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి దళిత కాలనీల్లో ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీధి లైట్లు, మిషన్ భగీరథ ద్వా రా ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు మాణిక్య మ్మ, పాపమ్మ, సరోజ, పీఆర్ఏఈ జగత్‌చంద్ర తది తరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో పర్యటించిన అధికారులు
ఎస్సీ, ఎస్టీ వాడల్లో ఇంకా క ల్పించాల్సిన మౌలిక వసతులను గుర్తించాలని ప్రభు త్వం ఆదేశానుసారం మంగళవారం మండలంలోని రాయికోడ్, కల్వాల్, సీపూర్లోని దళితవాడల్లో సర్వే నిర్వహించినట్లు ఎంపీడీవో రమేశ్‌కుమార్ తెలిపారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు సీసీరోడ్ల ఏర్పాటు, నూత న డ్రైనేజీ నిర్మాణాలు, విద్యుత్ దీపాలు, హైటెన్షన్ వి ద్యుత్ తీగాల సర్దుబాటు వంటి పనులను సూచించారన్నారు. పూర్తి సమాచారం ఉన్నతాధికారులకు అం దజేస్తామన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఏఈలు శ్రీకాంత్, మారెప్ప, ఫకీరయ్య, ఆయా గ్రామాల స ర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
దళితవాడల్లో ప్రత్యేక ప్రణాళిక
దళితవాడల అభివృ ద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలను తయారు చేస్తున్నామ ని స్పెషల్ ఆఫీసర్ జాన్ సుధాకర్, ఎంపీడీవో శ్రీధర్ అన్నారు. మంగళవారం మండలంలోని రుద్రసము ద్రం, సత్యవార్, కొండాదొడ్డి, మాదన్‌పల్లి తదితర గ్రామాల్లోని దళితవాడల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేర కు దళితవాడల్లో సమగ్ర సర్వే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 7న ఉప్పరిపల్లిలో ఎమ్మెల్యే చిట్టెం దళితవాడలో పర్యటించి సర్వేను ప్రారంభించారన్నారు. ఇప్పటి వరకు మండలంలోని లింగంప ల్లి, మహాద్వార్, సోమేశ్వరబండ, గుడిగండ్ల, జౌళాపురం, మాదన్‌పల్లి తదితర గ్రామాల్లో విద్యుత్, ఆర్‌డబ్ల్యూస్, రెవెన్యూ అధికారుల బృందాలు పర్యటించి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సర్వే చేశామన్నారు. జౌళాపురంలో సీసీ రోడ్లు, డ్రేనేజీ పనులకు సర్వే చే యించామన్నారు. ఆయా గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించడానికి ప్రభుత్వానికి నివేదికలను పం పించామని వారు పేర్కొన్నారు.