ఇటు బుల్లితెర అటు వెండితెరపై సత్తా చాటుతున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. చూడచక్కని అందం, ఆకర్షించే అభినయంతో తన అభిమానులని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుంది శ్రీముఖి. మొహమాటం అనే పదం కూడా మొహమాటపడేలా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. చిన్న సైజ్ లౌడ్ స్పీకర్ లా రెచ్చిపోతున్న శ్రీముఖి ఇటీవల సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది.
తాజాగా ఈ అమ్మడు నెటిజన్స్తో ముచ్చటించగా, ఓ నెటిజన్ శ్రీముఖికి పెళ్లి సంబంధం చూసినట్టుగా చెప్పుకొచ్చాడు. అక్క ఒక మంచి మ్యాచింగ్ ఉంది మాట్లాడుదామా.. నీకు పర్ఫెక్ట్ జోడి అంటూ తెలుపగా వెంటనే శ్రీముఖి నవ్వుతూ ఎవరది అంటూ స్పందించింది. కాని ఆ నెటిజన్ ఎవరు అనే విషయం చెప్పకపోవడంతో శ్రీముఖికి నెటిజన్ చూసిన సంబంధంపై సస్పెన్స్ కొనసాగుతుంది.