మంగళవారం 19 జనవరి 2021
Mahabubabad - Dec 02, 2020 , 06:08:31

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

  • కలెక్టర్‌ వీపీ గౌతమ్‌

డోర్నకల్‌, డిసెంబర్‌ 1: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్య లు తప్పవని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ హెచ్చరించారు. మంగళవారం తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీకాంత్‌ను ప్రభుత్వ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డోర్నకల్‌, అమ్మపాలం భూములను త్వరగా సర్వే నిర్వహించాలన్నారు. అనంతరం మున్సిపాలిటీలో రైల్వేస్టేషన్‌ నుంచి అంబేద్కర్‌ నగర్‌వరకు రోడ్లను పరిశీలించి, మొక్క లు నాటారు. కస్నా తండాలో వైకుంఠధామం, డంప్‌ యా ర్డు పరిశీలించారు. వైకుంఠధామాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డంప్‌ యార్డులో చెత్తను వేరు చేయు విధానంపై అవగాహన పొందాలన్నారు. గొల్లచర్ల జీపీ వైకుంఠధామం పనులను, రైతువేదిక, పల్లెప్రకృతి వనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చిలుకోడు జీపీలో వైకుంఠధామం, డంప్‌ యార్డు పనులను పరిశీలించారు.  అభివృద్ధి పనులు త్వరగా చేపట్టి, అభివృద్ధి పనుల ఫోటోలను అప్‌లోడ్‌ చేయాలని సర్పంచ్‌ సమ్మిరెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వాంకుడోత్‌ వీర న్న, వైస్‌ చైర్మన్‌ కోటిలింగం, ఎంపీపీ బాలునాయక్‌, కమిషనర్‌ వెంకటేశ్వర్లు, పీఆర్‌ డీఈ మహేశ్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో, ఏవో పద్మజ, ఎంపీవో మునవర్‌ బేగ్‌, కౌన్సిలర్లు శరత్‌, అశోక్‌, కో ఆప్షన్‌ రాంభద్రం, రైల్వే మేనేజరు కనుక రాజు, మెంబర్‌ ఖాదర్‌, సర్పంచ్‌లు రాం బాయి, సమ్మిరెడ్డి, వెంకటేశ్వర్లు, వీరన్న, యశోధర, పీఏసీఎస్‌ చైర్మన్‌ భిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలి.. 

మహబూబాబాద్‌ రూరల్‌ : ప్రభుత్వ స్థలాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ అధికా రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్న భూములను వాటి సర్వే  నం బర్లతో సహా గుర్తించి పెన్సింగ్‌ ఏర్పాటు చేసి, బోర్డులు పెట్టించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో కొమురయ్య, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్‌ ఏడీ నర సింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.