ఇంట్లో ఫైల్ మరిచినట్టు
పర్స్ మరిచినట్టు
మొబైల్ మరిచిపోయాను
ఎప్పుడూ షర్ట్ ఎడమ వైపు జేబులో ఉండే
మొబైల్ లేకుంటే గుండె లేనట్టే
మనసు ఏదో కోల్పోయినట్టు కొట్టుకుంటున్నది!
ఎన్ని కాల్స్ వచ్చాయో
గొంతు చించుకొని మొబైల్ ఎంత అరిచిందో
పసి కూనలా!!
ఫోన్ లేపలేదంటే మిత్రులు ఏమనుకున్నారో
ఎన్ని అపార్థాలో!
ఎంత గర్వమనుకుకున్నారో!
సమావేశాలకు రమ్మని మాటిమాటికి
ఎందరినుంచి ఎన్ని స్వాగతాలు వచ్చాయో
ఇక ముందు నిరసనలే!
ఇప్పుడు అర్థమవుతోంది
చెవి ఎంత ప్రశాంతంగా ఉందో
గోల గోల లేకుండా!
నిన్నటి చెవిపోటు తగ్గింది!!
మొబైల్ కూడా ఇంట్లో
సోఫాపై విశ్రాంతి తీసుకుంటున్నది…
– కందాళై రాఘవాచార్య 87905 93638