భాషా సేవలో తరించిన సాహితీ వారధి
భాష కేవలం భావప్రసారానికి దోహదపడే మాధ్యమమే కాదు, వివేచనను పెంచి, ఉన్నత వైఖరులతో కూడిన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేందుకు ఉత్కృష్టమైన పాత్ర పోషిస్తుంది. ఇక మాతృభాష స్థానం మరెంతో గొప్పది. పాఠ్యపుస్తకాల రచయిత్రిగా, కవయిత్రిగా పేరు ప్రఖ్యాతులు గాంచారు డాక్టర్ బండ సరోజన. వరంగల్ జిల్లా జనగామ దగ్గరలోని లద్నూరులో 1941 ఏప్రిల్ 3న ఆమె జన్మించారు. తాను పుట్టిన లద్నూరు గ్రామం నుంచి లండన్ దాకా తెలుగు భాష కోసం వారధిగా నిలిచిన విద్యావేత్త.
(ఈనెల 22న దివంగతులైన డా.బండ సరోజనకు అక్షర నివాళి)
భాష కేవలం భావప్రసారానికి దోహదపడే మాధ్యమమే కాదు, వివేచనను పెంచి, ఉన్నత వైఖరులతో కూడిన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేందుకు ఉత్కృష్టమైన పాత్ర పోషిస్తుంది. ఇక మాతృభాష స్థానం మరెంతో గొప్పది. పాఠ్యపుస్తకాల రచయిత్రిగా, కవయిత్రిగా పేరు ప్రఖ్యాతులు గాంచారు డాక్టర్ బండ సరోజన. వరంగల్ జిల్లా జనగామ దగ్గరలోని లద్నూరులో 1941 ఏప్రిల్ 3న ఆమె జన్మించారు. తాను పుట్టిన లద్నూరు గ్రామం నుంచి లండన్ దాకా తెలుగు భాష కోసం వారధిగా నిలిచిన విద్యావేత్త.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీఈఆర్టీ ప్రభుత్వ ఉన్నత స్థాయి విద్యా అధ్యయన సంస్థలో ఆమె ఆచార్యులుగా పనిచేశారు. విద్యాశాఖలో పాఠ్యపుస్తకాల రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఆమె పాఠ్యపుస్తక రచనల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి మహిళా పురస్కారాన్ని అందుకున్నారు. జాతి నిష్టమైన సంస్కృతి మీద ఆధారపడి ఉంటుందని భౌతికంగా అభ్యుదయాన్ని సాధించడానికి జాతి సంస్కృతి చరిత్ర ఎంతో పనిచేస్తుందని చెప్పిన రచయిత్రి ఆమె. ‘ఇండియా కథలు-అమెరికా వెతలు’ అనే గ్రంథాన్ని రచించిన సందర్భంలో రెండు ప్రపంచాల మధ్య ఉన్న విభజనల అనుబంధాలను పరిశీలించి తనదైన దృష్టి కోణంతో ఆవిష్కరించారు.
‘సప్త స్వరాలు’, ‘ఒక పువ్వు పూసింది’
‘ఎర్రమందారం’, ‘అక్షర రూపాలు’ అనే
కవితా సంపుటాలు, ‘గాలిపడిగలు’
(మ్యూజింగ్స్) వాచకాలు మన వారసత్వ
సంపద వ్యాస సంపుటి ఆమె స్వీయకృతులు.
తెలంగాణ జన జీవితం, గ్రామీణ సంస్కృతి, ఆనాటి స్వాతంత్య్ర పోరాట విశేషాలు, స్త్రీల ఆలోచనలు ఎన్నో సామాజిక అంశాలతో కూడిన ఆమె జీవితానుభవాల మధురస్మృతుల విశేషాలతో ‘లచ్చుమమ్మ ముచ్చట్లు’ – నా రేడియో ముచ్చట్లు (ఆకాశవాణి హైదరాబాద్ వారి సౌజన్యంతో) వేశారు . ‘ప్రకృతికే ఆభరణాలు’ (రేడియో రూపకాలు), ‘అక్షరమే ఆయుధం’ (రేడియో ప్రసంగాలు) ప్రచురించారు. ఆమె హృదయాంతరంగ ఆవిష్కరణ చేసిన ‘సరోజం’ స్వీయ చరిత్ర ఎన్నో విషయాలను అందించింది. తెలంగాణ తెలుగు పద ప్రయోగం చేస్తూ సాగిన ఆత్మకథాత్మక కథ ‘బర్రెంక చెట్టు’ చాలా ప్రాచుర్యం పొం దిన కథ. కలం పట్టిన చేతులు విశ్రమించవచ్చు. కానీ ఆ కళ నుంచి జాలువారిన ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి. అమెరికాలోని వర్జినియాలో తమ కుమార్తె అపర్ణ కడారి ఇంట్లో నివసిస్తూ, 2026 అక్టోబర్ 22వ తేదీన అక్కడే ఆమె మృతి చెందారు. అనంతలోకాలకు వెళ్లిన ఈ సరస్వతీ పుత్రిక రచయిత్రి మరణం కేవలం ఒక వ్యక్తి ముగింపు కాదు, భాషాభిమాన సాహిత్య శకానికి ముగింపు. శరీరం నష్వరమైనది. కానీ, అక్షరం అమరమైనది. రచనలతో వెలుగులు నింపిన బండ సరోజన కీర్తి ఎప్పటికీ వర్ధిల్లుతుంది. అక్షర రూపధారికి కన్నీటి అంజలి ఘటిస్తున్నాను.
డా.కొండపల్లి
నీహారిణి
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

