Telangana | మన బతుకు చిత్రమే.. తెలంగాణ సిన్మా
తెలంగాణ, తెలుగు సినిమా ఇప్పుడు తన అస్తిత్వాన్ని జల్లెడ పట్టుకుంటూ.. కొంగును ముడికట్టుకుంటూ, ఎనను ఎగదోసుకుంటూ మెయిన్‌స్ట్రీమ్ సినిమాగా ముందుకు రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నది.
తెలంగాణ, తెలుగు సినిమా ఇప్పుడు తన అస్తిత్వాన్ని జల్లెడ పట్టుకుంటూ.. కొంగును ముడికట్టుకుంటూ, ఎనను ఎగదోసుకుంటూ మెయిన్‌స్ట్రీమ్ సినిమాగా ముందుకు రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నది. తన స్పేస్ తాను తీసుకుని, తన పరిధులు విస్తరించుకుంటూ వెండితెరను కమ్ముకుంటూ.. చిమ్ముకుంటూ వినిర్మాణమవుతూ దక్షిణాది సినిమా దూసుకుంటూ పోతున్నది.
డిజిటల్ మార్కెటింగ్ విపణిలో రెక్కలు విప్పుకొంటున్నదంతా ఇక కొత్త సినిమా కాలం. తారల కాంబినేషన్ మాయాజాలం ఇప్పుడు పని చేయడం లేదు. కంటెంటే మాయాజాలాన్ని రీకంపోజ్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నది. హీరో ఇప్పుడు మెటా హీరో అయిపోయాడు. విలన్ కూడా మెటా విలన్ స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు. ప్రేక్షకుడి చేతుల్లోకి పగ్గాలొచ్చేశాయి. సినిమా ఇప్పుడు ప్రేక్షకుని మన్ననలోనే కండ్లు తెరుచుకుని విజయాలు చవిచూస్తున్నది.
The harrowing experience has left him haunted by the past and fearless in the present
– Peaky Blinders
Telangana | ఒక సినిమా విజయానికి మరో సినిమా విజయానికి మధ్య పోలికే ఉండటం లేదు. ఒక హీరో విజయ రహస్యం, ఆ సినిమాతోనే లాక్ అయ్యి తలుపులు మూసుకుపోతున్నాయి. అయినా హీరో తన ఆకృతిని పెంచుకుంటూ భాషాంతరాల అగాధాలను, పురా అగాధాలను సమం చేస్తూ, ప్రేక్షకుడు తనతో కాంటాక్ట్‌లో ఉండేట్టుగా చూసుకుంటూ.. వెనక్కి, ముందుకూ, పైకి విస్తృతమవుతున్నాడు. తెర ప్రసంగాలు కేవలం సామాజిక రాజకీయ అంతరాలను ఎగదోస్తున్నాయి. కానీ, అంతరంగంలోని మనిషిని మాట్లాడించలేకపోతున్నాయి. అందుకే మన సినిమాల్లో చర్యలు మాత్రమే ప్రేక్షకుడిని నమ్మించగలుగుతున్నాయి. చర్యల తాలూకు భాషనే ప్రేక్షకుడిప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాడు.
అటువంటి చర్యల రంగస్థలానికే ప్రేక్షకుడు పట్టం కడుతున్నాడు. అనివార్యంగా సినిమా ఇప్పుడు సృజనకు రంగస్థలమే కాకుండా రణస్థలంగా మారిపోయి చాలా వేగంగా పనిముట్లను మార్చుకునేలా దర్శక, రచయిత, సాంకేతిక కళాకారులను సిద్ధపడేలాగా తయారు చేస్తున్నది. ప్రతి పాత్ర కొత్త ఊపిరితో తొణికిసలాడితే తప్ప జీవ ప్రవేశం జరగడం లేదు. ప్రేక్షకుల ఆదరణ లభించడం లేదు. దర్శక నిర్మాతలకు ఇప్పుడు ప్రతి సినిమా ఒక వార్ క్రై.. ఒక ఎన్నికల గెలుపోటమల ప్రకటన. తెలుగు, తెలంగాణ సిన్మా సృజనకారుల కొత్త మ్యానిఫెస్టో ఇప్పటి సినిమా.
చాలావరకు సినిమాలన్నీ గతాన్ని వాస్తవంగా, ఆర్గానిక్‌గా, మల్టిపుల్ నెరేటివ్స్గా ప్రేక్షకుల వీక్షణం కోసం దూసుకువస్తున్నవే. గతంలోని చారిత్రక ఖాళీలను పూరించడానికి వస్తున్న వర్తమానమే ఇప్పటి సినిమా. గతంలోని మన బాల్యం, మన కుటుంబాల వివిధ రూపాల నీడలు, పాత్రల చుట్టూ బలమైన మానసిక సంక్షోభాలు, వాటి రంగులూ, పొంగులూ మన మెటా హీరో చుట్టూ వలయాకారంలో తిరుగుతూనే ఉంటాయి. వాటి మధ్యలో నిలబడి మన హీరో ఇటువంటి మల్టిపుల్ నెరేటివ్ ైస్టెల్‌తో, జీవభాషతో, అరమరిక లేని మానవ సంబంధాల నెనరుతో, రక్తప్రసరణతో.. దిగువ మధ్యతరగతి జీవితాన్ని ప్రేక్షకుడికి పట్టివ్వడానికి వస్తున్న ఈ తరం తెలుగు సిన్మా.. ‘షరతులు వర్తిస్తాయి’.
అయితే ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు కుమారస్వామి (అక్షర) ఎదురుకున్న అనేకానేక అనుభవాలు, ప్రతిబంధకాలు, ఊహించకుండా ఎదురైన సవాళ్లూ, ప్రతిష్టంభనలూ ఎన్నెన్నో. వాటిని తెలుసుకోవడానికి తనతో తన ఫస్ట్ పర్సన్ నెరేటివ్‌ను గుండె ఆనించి వింటే.. సినిమా రూపకల్పనలో, నిర్మాణంలో ఉండే కష్టనిష్ఠూరాలు, క్రియేటివ్ రంగంలో ఉండే వాస్తవిక సూత్రాలు తెలుస్తాయేమో!
‘తెలంగాణ, చిన్న సినిమాలు మనకేమీ అంత దగ్గరగా లేవు. ఈ మాటలు వినగానే కొత్త తరం, యువ దర్శకులకు నిరాశ కలుగుతుంది. షరతులు వర్తిస్తాయి కథ నా జీవితంలో జరిగినదే. నా చుట్టూ ఉన్న మనుషులనే పాత్రలుగా మార్చి అల్లిన కథ ఇది. కథనంలోని పాత్రలన్నీ కరీంనగర్ జీవభాషతో, బతుకు తాలూకు స్వభావంతో, అన్నం మెతుకులను చింతతొక్కు కారంతో కలుపుకొని తిన్నంత అలవోకగా.. కష్టాలను, నమ్మకాలను, పగటి కలలను కలుపుకొంటూ, తింటూ జీవన పోరాటాన్ని ఎదుర్కొంటుంటాయి. అపజయాలను కూడా మూటగట్టుకుంటూ ఉంటాయి.
అందుకే అవి కథనంలోని సరిహద్దు రేఖలను దాటలేకపోయాయి. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేటట్టు సిన్మా తీయాలి. అప్పుడే మనం నిర్మాతలకు, ప్రేక్షకులకు మధ్య వారథిగా ఉండి మంచి సిన్మా తీసిన దర్శకుడిగా మనగలుగుతాం. మధ్య తరగతి ఒడుదొడుకులను తెలంగాణ వ్యక్తీకరణతో, భావోద్వేగాల మూటతో సజీవంగా తెరమీదికి, అందులోనూ మెయిన్‌స్ట్రీమ్ ఎనర్జీతో వచ్చిన తెలంగాణ సిన్మా షరతులు వర్తిస్తాయి. తెలంగాణ సిన్మాను ప్రేక్షక దేవుళ్లు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నా’ అని ఈ సినిమా దర్శకుడు అంటున్నారు. వైవిధ్య కథనాన్ని తెరమీదికి తెస్తున్న కొత్త దర్శకుడిని ఆశీర్వదిద్దాం. మన తెలంగాణ సిన్మాను బతకనిద్దాం.
– కవి సిద్ధార్థ
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

